Wednesday, January 22, 2025

‘గని’ విడుదల తేదీ ఖరారు

- Advertisement -
- Advertisement -

Varun Tej's 'Ghani' Teaser Releasing on Nov 15th

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ మధ్యే విడుదలైన ‘రోమియో జూలియట్…’ పాటకు సైతం మంచి స్పందన వస్తోంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News