Thursday, January 23, 2025

అద్భుతమైన మేకోవర్‌తో వరుణ్‌తేజ్ ‘గని’లో నటించాడు

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘గని’ రిలీజ్ పంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “గని చిత్రాన్ని మల్టీ స్టారర్ అనవచ్చు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర… ఇలా హీరోలంతా కలిసి ఈ సినిమా కోసం వచ్చి నిలబడ్డారు. ఈ సినిమాకు ఇద్దరు చాలా ముఖ్యం. ఒకరు వరుణ్ మరొకరు కిరణ్. వీరిద్దరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు”అని అన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ “దర్శకుడు కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు”అని తెలిపారు. ఉపేంద్ర మాట్లాడుతూ “వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం చూశాను. ఆ సినిమాలో వరుణ్‌కు ఇప్పుడు చూస్తున్న వరుణ్‌కు అసలు సంబంధం లేదు అన్నట్లుగా అనిపిస్తోంది. అద్భుతమైన మేకోవర్‌తో అతను ‘గని’ సినిమాలో నటించాడు”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News