Tuesday, December 24, 2024

చేతబడి… దాడి చేయడంతో వృద్ధుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

సికింద్రాబాద్: మెదక్ జిల్లా హావేలి ప్రాంతం ఘనపూర్ మండలం ఔరంగాబాద్ గ్రామంలో ఓ వృద్ధుడు చేతబడి చేస్తున్నాడని గ్రామస్థులు దాడి చేయడంతో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుద్దయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. చేతబడి చేస్తున్నారని ఈ నెల 10న వృద్ధుడిని గ్రామస్థులు చితకబాదారు. గ్రామంలో వృద్ధుడు, మరో వ్యక్తి మధ్య గత కొన్ని రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ నెల 9న అనారోగ్యానికి గురై సదరు వ్యక్తి చనిపోయాడు. వృద్ధుడు దుద్దయ్య చేతబడి వల్లే చనిపోయాడని గ్రామస్థుల ఆరోపణలు చేశారు.

Also Read: రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News