Thursday, December 12, 2024

అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ విసిగా ఘంటా చక్రపాణి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఉత్తర్వులు
జారీ బాధ్యతలు
స్వీకరించిన చక్రపాణి

మన తెలంగాణ/హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొ ఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఘంటా చక్రపాణి శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రొ.చక్రపాణి అంబేద్కర్ విశ్వవిద్యలయం సోషియాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా, వివిధ పరిపాలనా పదవుల్లో సేవలు అందించి సీనియర్ ప్రొఫెసర్ హోదాల్లో పదవీ విరమణ చేశారు. అంతకుముందు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి సేవలు అందించారు.

జెఎన్‌టియుహెచ్ ఇంఛార్జ్ విసిగా..
జవహార్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ(జెఎన్‌టియుహెచ్) ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News