Wednesday, January 22, 2025

ఘరానా దొంగ నల్లమోతు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నిందితుడిపై 70 కేసులు
రాత్రి సమయంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు
26.4తులాల బంగారు ఆభరణాలు, కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం

హైదరాబాద్: రాత్రి సమయంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఘరానా దొంగలను ఎల్‌బి నగర్ సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 26.4తులాల బంగారు ఆభరణాలు, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని వెస్ట్‌గోదావరి జిల్లా, కామవరపుకోట గ్రామానికి చెందిన నల్లమోతుల సురేష్ అలియాస్ ఎర్రోడ్ కృష్ణా జిల్లా తిరువురూ మండలంలోని లక్ష్మిపురంలో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయడంతో పోలీసులు 13 సంవత్సరాల వయస్సులో అరెస్టు

జైలుకు వెళ్లిన తర్వాత అక్కడే మరో దొంగ ఉమామహేశ్వర్ రావుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూలీ పనిచేశాడు. వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో ఇద్దరు కలిసి చోరీలు చేయడం ప్రారంభించారు. ఇద్దరు కలిసి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలు చేశారు. నిందితుడు తన గ్రామం నుంచి బస్సులో వచ్చి నగరంలోని ఓఆర్‌ఆర్, సికింద్రాబాద్ గ్రౌండ్‌లో ఉండి రాత్రి సమయంలో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్నాడు. చోరీచేసే సమయంలో నిందితుడు తన వేలిముద్రలు పడకుండా గ్లౌజులు, కాళ్లకు సాక్సులు వేసుకుని చోరీలు చేస్తున్నాడు.

చోరీ చేసిన తర్వాత సొత్తును తీసుకుని బస్సులో తిరిగి తన గ్రామానికి వెళ్లేవాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్లల్లో చోరీలు జరగడంతో పోలీసులు నిందితుడిపై నిఘాపెట్టి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు యాదయ్య, వెంకటేశ్వర్లు,నిరంజన్, ఎస్సైలు శ్రీనివాసరావు, రాములు నాయక్, హెచ్‌సిలు శంకర్, పిసిలు పవన్‌కుమార్, సయిద్‌ఇబ్రహిం, రాజ్‌కుమార్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News