Tuesday, December 24, 2024

రోడేక్కిన ఘట్‌కేసర్ కౌన్సిల్ వివాధాలు..

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ ః ఘట్‌కేసర్ మున్సిపాలిటీ కౌన్సిల్ గ్రూప్ తగాదాలు పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలలో దూషణలు, తోపులాటలతో బయటపడగా శనివారం చైర్ పర్సన్‌కు వ్యతిరేఖంగా నినాధాలు చేస్తు మరో వర్గం కౌన్సిలర్‌కు చెందిన అనుచరులు అంబేద్కర్ విగ్రహాం వద్ద రాస్తా రోక్ చేసి మున్సిపాలిటీ కార్యలయం వద్దకు ర్యాలీగా వెళ్ళి అక్కడ చైర్ పర్సన్ దిష్టి బొమ్మదగ్దం చేయడంతో గ్రూప్ తగాదాలు మరోమారు రోడ్డు కేక్కాయి. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ ముల్లి పావని వర్గం, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి వర్గాలుగా గత కొన్ని నెలలుగా అంతర్గతంగా వివాధం నడుస్తూ వచ్చింది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు కార్యక్రమంపై మున్సిపాలిటీ కార్యలయంలో కమిషనర్‌తో చైర్ పర్సన్,

ఆమె భర్త, వైస్ చైర్మన్‌లు సమిక్ష జరుపుతుండడంతో వైస్ చైర్మన్ వర్గంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కార్యలయంలోకి వచ్చి చైర్ పర్సన్ భర్త ఎలా వస్తారు అంటూ సదర్ కౌన్సిలర్లు, చైర్ పర్సన్ భర్త మద్య వాగ్వివాధం జరిగినట్లు తెలిసింది. దీనితో పట్టణ ప్రగతి సమావేశం కార్యక్రమంలో వైస్ చైర్మన్ వర్గానికి చెందిన కౌన్సిలర్ తన అనుచరులను తెచ్చుకోవడంతో ఇది గొడవకు దారి తీస్తుందని భావించిన చైర్ పర్సన్ భర్త పోలీసులకు తెలియపర్చడంతో ఒక్క సారిగా తీవ్రదూషణలతో తోపులాటకు దారితీసింది. దీంట్లో పోలీసులు కలుగ జేసుకొని ఇరువర్గాలను అదుపు చేశారు. దీనితో సద్దుమనిగిందనుకున్న వివాధం శనివారం సదర్ కౌన్సిలర్ అనుచరులు చైర్ పర్సన్‌కు వ్యతిరేఖంగా నినాధాలు చేస్తు అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోక్ చేసి మున్సిపాలిటీ కార్యలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ చైర్‌పర్సన్ దిష్టిబొమ్మ దగ్దం చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఇరువర్గాల వివాధంపై పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చామకూర మల్లారెడ్డికి తెలియ పర్చినప్పటికి ఎలాంటి ప్రతి స్పందన లేకుండా వెళ్ళడం పట్ల కార్యకర్తలు అసహానం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య గొడువను సద్దుమనిగేలా చేయాల్సిన మంత్రి ఎవరికి వారిని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు వినిపించారు. మంత్రి ప్రోద్బలంతోనే ఓ వర్గం నాయకులు అవకాశం దొరికి నప్పుడు వివాధాలు సృష్టించడానికి చూస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మంత్రి ఆది నుండి ఎక్కడికక్కడ విభజించు పాలించు అనే విధంగా నాయకుల మద్య వివాధాలు సృష్టిస్తారనే అపవాదు ఉన్నది. వచ్చే అసేంబ్లి ఎన్నికలలో మంత్రికి ఇలాంటి వర్గ విభేదాలు ఎంత వరకు మేలు చేస్తాయనేది వేచి చూడాలి. ఇప్పటికైన కౌన్సిల్ వివాధాలు సద్దుముగుతుందా లేకా మరింత రచ్చకెక్కనున్నాయా అనేది వేచి చూడాల్సిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News