- Advertisement -
హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ పేరు మెమోరియల్ హాల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. మెమోరియల్ హాల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతోపాటు ఆయన నటించిన 350 చిత్రాలకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, షీల్డ్‌లు ఉంచనున్నారట. కృష్ణ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండేలా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. సూపర్‌స్టార్ కృష్ణ పేర అతిపెద్ద మెమోరియల్ హాల్ కట్టాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
Ghattamaneni family decided Krishna Memorial Hall in Hyderabad
- Advertisement -