- Advertisement -
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 72 ఏళ్లు.
పంకజ్ ఉదాస్ 1951 లో సౌరాష్ట్రలోని జట్పూర్ లో జన్మించారు. ముంబయిలో ఆయన విద్యాభ్యాసం సాగింది. తండ్రినుంచి దిల్రుబా అనే వాద్య పరికరం వాయించడం నేర్చుకునే క్రమంలో పంకజ్ కు సంగీతంపై ఆసక్తి కలిగింది. రాజ్ కోట్ లోని సంగీత్ అకాడమీలో చేరి, తబలా వాద్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత గులాం ఖాదిర్ ఖాన్ సాహెబ్ వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. గజల్ గాయకుడిగా సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన పంకజ్ ఉధాస్, పలు బాలీవుడ్ పాటలకూ గాత్రదానం చేశారు. చిఠ్ఠీ ఆయీహై (నామ్), జియే తో జియే కైసే (సాజన్), ఆజ్ ఫిర్ తుమె పే ప్యార్ ఆయా హై (దయావన్), ఛుపానే భీ నహీ ఆతా (బాజీగర్) వంటి పాటలు ఆయన గళంలోంచి వెలువడినవే.
- Advertisement -