Wednesday, December 25, 2024

కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళకు పోలీస్‌ల వేధింపులు

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన యువతిని పోలీస్‌లు లైంగికంగా వేధించారు. లైంగిక కోరిక తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు బలవంతంగా రూ.1000 పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. సెప్టెంబర్ 13 న ఈ సంఘటన జరిగింది. అంతటితో ఆగకుండా రాకేష్ కుమార్ అనే కానిస్టేబుల్ మళ్లీ ఆమెకు ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని వేధించ సాగాడు. చివరకు ఆ మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయడంతో ఘజియాబాద్ పోలీస్‌లు రంగం లోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముగ్గురు పోలీస్‌ల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుల్ రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News