Monday, December 23, 2024

జిహెచ్‌ఎంసి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: నగరంలో మరోరెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మిఆదేశించారు. గ్రేటర్ వ్యాప్తంగా రానున్న 24 గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అల్డర్ ప్రకటించడంతో ఎంత వర్షం కురిసినా నగరవాసులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండ చర్యలు తీసుకోవాలని అన్నారు. మంగళవారం సర్కిల్‌లో పని చేస్తున్న కార్యనిర్వహక ఇంజనీర్లతో వైర్‌లెస్ సెట్ల ద్వారా మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు ఎలాంటి ఇబ్బందిలేకుండా నీరు నిలవ కుండ జాగ్రత్తలు తీసు కోవాలని ఆదేశించారు.

వర్షకాలం ముందస్తూ ప్రణాళికలలో భాగంగా ఏర్పాటు చేసిన 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృం దాలు మూడు షిప్టుల చొ ప్పున 24/7న పని చేస్తున్నాయన్నారు. ఈ బృందాలు మరింత అప్ర మత్తంగా ఉంటూ రోడ్డు పై నిలిచిన నీరును వెనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అత్యవసర ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని మే యర్ కోరారు. వర్షం కారణం ఏలాంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా సహా యక చర్యలకు జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన 040- 21111 111 నంబర్‌కు గాని డిఆర్ ఎఫ్ బుద్ధ భవన్‌లో హెల్ప్ లైన్, కం ట్రోల్ రూం మొబైల్ నంబర్ 9000113667కు సమాచారం ఇవ్వా లని ఆమె కోరారు.

అదేవిధంగా భారీ వ ర్షాలు కురుస్తున్నందున నగరంలో ఇప్పటికే గుర్తించిన శిథిలావస్థలో ఉన్న గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప రిధిలో పని చేసే అధికారులకు సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవు లు ఇవ్వద్దని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు కూడా అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News