- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను కమిషనర్ లోకేష్ కుమార్ అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాలలో మూడు సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. జిహెచ్ఎంసి పరిధిలోని ఎంఎల్ఎలతో మేయర్ విజయ లక్ష్మి సమీక్షలు జరుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది. ఉప్పల్ నియోజకవర్గ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. గతంలో నీటి మునిగిన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
- Advertisement -