Monday, January 20, 2025

ఐటి కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలపై జిహెచ్‌ఎంసి, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోప్రధాన ఐటి కా రిడారైనా హైటెక్ సిటీ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ ఇ బ్బందులపై జిహెచ్‌ఎంసితో పాటు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చినుకుపడితే చాలు ఈప్రాంతంలోగంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇటీవల కురిసిన వర సవర్షాలకు కారణంగా రోడ్లపై వరద నీరు చేరడంతో దీంతో ఐటి కారిడార్‌లోని ప్రధాన మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడడంతో ఐటి ఉద్యోగులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే క్రమంలో ఇందుకు కారణమవుతున్న వివిధ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నా రు.

ఇదే క్రమంలో ఇటీవలే ఐటి సంస్థల ప్రతినిధులతో స మావేశం నిర్వహించిన పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. ఐటి ఉద్యోగులకు సంస్థలే స్వయం గా ట్రాన్స్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తిగత వాహనాల సంఖ్య వాడకం తగ్గించడం ద్వారా కొంత ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందని పోలీసుశాఖ అధికారులు ఐటి సంస్థలకు సూచించారు. అంతేకాకుండా ఐటి సంస్థలన్నీ ఒకేసారి ఉద్యోగులను బయటి రాకుండా పని వేళాలు మార్పులు చేయడంతో పాటు ప్రాంతాల వారీగా గంటల వారిగా ఉద్యోగులను బయటి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదే క్రమంలో ట్రాఫిక్ జామ్‌కు గల ప్రధాన కారణాలపై దృష్టి శాఖల వారిగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా జి హెచ్‌ఎంసితో పాటు పోలీసుశాఖ అధికారులు టిఎస్‌ఐఐసి ప్రతినిధులు కలిసి బుధవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో అధికార బృందం ఐక్యా రోటరీ, లెమన్ ట్రీ, సైబర్ టవర్స్ ఎన్‌ఐఎ, ఖైత్లాపూర్ ఆర్‌ఎంబి, గోకుల్ ప్లాట్స్, కెపిహెచ్‌బి ఫోరం మాల్, కొత్తగూడ బొ టానికల్ గార్డెన్, ఐఐటి జంక్షన్, డెలాంటీ రోడ్డు, రాడిస న్ హోటల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు నిలుస్తున్న ప్రదేశాలు (వాటర్‌లాకింగ్ పాయింట్స్), రోడ్లు, జంక్షన్లతో పాటు ఇరుక్కుగా ఉన్న రోడ్లను గుర్తించారు. వర్షం పడితే రోడ్లపై వరద నీరు నిల్వకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు జంక్షన్లు, ఇరుక్కైనా రోడ్లను యుద్ద ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. శాఖల వారీగా ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధ్దం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డిసిపి సందీప్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఎడిసిపి శ్రీనివాస్‌రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఎసిపి రణవీర్‌రెడ్డి, రాయదుర్గం, మాదాపూర్, గచ్బిబౌలి ట్రా ఫిక్ ఇన్‌స్పెక్టర్ల శ్రీనాధ్, నర్సయ్య, రాజశేఖర్‌రెడ్డి, టిఎస్‌ఐఐసి, జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News