Wednesday, January 22, 2025

ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభతరం: లోకేష్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా వార్డు వ్యవస్థను అందుబాటులోకి తేవడంతో ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభతరం కానుందని జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. జూన్ 2 నుంచి అమలు కానున్న వార్డు పరిపాలన వ్యవస్థకు సంబంధించిన అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జనమండలి ఎండీ దానకిషోర్ లతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ మాట్లాడుతూ వార్డు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా నగర నలుమూలల నుండి వస్తున్న ప్రజా సమస్యలను అత్యంత సులువుగా, వేగవంతంగా పరిష్కరించడానికి వీలుపడుతుందన్నారు.

వార్డు ఆఫీస్ లలో జిహెచ్‌ఎంసి విభాగాలైన బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, వార్డ్ ఇంజనీర్, ఎంటమాలజి, జలమండలి, విద్యుత్, కమ్యూనిటీ తదితర విభాగాలతో కూడిన అధికారులు పని చేస్తారన్నారు. ఇక మీదట ప్రజా సమస్యలను వార్డు స్థాయిలోనే పరిష్కరించడం ద్వారా వారు ఎక్కడి వెళ్లాల్సిన రావాల్సిన పని ఉండందని చెప్పారు. వార్డు ఆఫీస్ కు వచ్చే ప్రజల పట్ల అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కమిషనర్ దిశా నిర్దేశనం చేశారు. అత్యధిక ఫిర్యాదులు శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలపైనే వస్తున్నాయన్నారు. వార్డు లెవెల్ సిబ్బంది ప్రతి రోజు ఉదయం వేళాల్లో తమ పరిధిలో వార్డు లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తప్పని సరిగా అందరూ వార్డు కార్యాలయం లో ఉండాలని ఆదేశించారు.

ఉదయం తీసుకున్న విన్నపాలు ఫిర్యాదులను డేటా ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి, సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారుడికి తెలియ పర్చాలన్నారు. వార్డు స్థాయిలో సిటీజన్ చార్టర్ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వార్డు వ్యవస్థ పౌర సేవల కేంద్రంగా పనిచేయాలని అదేశించారు. వార్డు వ్యవస్థ పై టౌన్ ప్లానింగ్, ఎంటమాలజి, శానిటేషన్, జలమండలి తదితర విభాగాలపై సమగ్ర శిక్షణను సంబంధిత జోన్ లలో హెచ్.ఓ.డి లతో నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం డిప్యూటీ కమిషనర్లకు, వార్డు లెవల్ అధికారులకు సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు. వార్డు కార్యాలయాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, పరిపాలన పై ఎప్పటికప్పుడు జోనల్, డిప్యూటీ కమిషనర్లు రోజువారీగా సమీక్షించాలని సూచించారు. వార్డు వ్యవస్థ పనితీరుపై నెల రోజుల పాటు క్షుణంగా పరిశీలించి మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News