Sunday, September 8, 2024

సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిహెచ్ఎంసి కమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ గురువారం సమీక్ష నిర్వహించారు. జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు సమీక్షకు హాజరయ్యారు. వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

హైదరాబాద్‌లో మరో 4గంటలు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ టీంలు సిద్ధంగా ఉండాలని మేయర్ సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News