Monday, December 23, 2024

కృష్ణకాంత్ పార్క్‌లో అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్ లో ప్రజలకు, వాకర్స్ కు కనీస వసతులకు కల్పనకు మంజూరు చేసిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి కృష్ణకాంత్ పార్క్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలం, ఎస్‌పిఆర్ క్రీడా మైదానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ ట్రాక్, వాష్ రూమ్, టాయిలెట్, సీవరేజ్ డ్రైన్ బాక్స్ నిర్మాణం, క్యాంటీన్ మరమ్మతులు పనులు త్వరితగతిన పూర్తి చేసి సందర్శలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా వెంగళరావు నగర్ లో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన పూరైన నేపథ్యంలో వెంటనే నిర్మాణ అంచనా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రహమత్‌నగర్ లో ఎస్‌పిఆర్ ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈ రాజ్ కుమార్ కార్పొరేటర్లు దేదీప్య, సి.యన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News