Sunday, December 22, 2024

‘జిహెచ్ఎంసిలో పాతుకొనిపోయి… వందల కోట్లు తింటున్నారు’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టు మెట్లు ఎక్కే వరకు కౌన్సిల్ భేటీ జరగడం లేదని బిజెపి కార్పొరేటర్లు మండిపడుతున్నారు. జిహెచ్ఎంసిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రూ.8437 కోట్లు జిహెచ్ఎంసి బడ్జెట్ పై చర్చ సందర్భంగా బిజెపి కార్పొరేటర్లు మాట్లాడుతూ…. పివికి భారత రత్న కేటాయించినదుకు కేంద్ర ప్రభుత్వానికి బిజెపి కార్పొరేటర్లు ధన్యవాదాలు తెలిపారు. అయితే కౌన్సిల్ లో అధికార పక్షం అజెండా ఇవ్వరని, కార్పొరేటర్లు అడిగితే సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. మేయర్ విజయ లక్ష్మీ, కమిషనర్ కు సైతం గౌరవం లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. జిహెచ్ఎంసి సమాచారం గోప్యంగా ఎందుకు పెడుతున్నారని, అధికారులు ఎవరినీ లెక్క చేయడం లేదని, జిహెచ్ఎంసిలో ఐఎఎస్, ఐపిఎస్ లు ఉన్నారని, కొంతమంది అధికారులకు ఆసరాగా జిహెచ్ఎంసి పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ఎం పనిచేస్తున్నారని, అంతా ఉన్నతాధికారులు నల్లాలు ఫిట్టింగ్ చేస్తారా? అని చురకలంటించారు.

డిప్యుటీషన్ పై జిహెచ్ఎంసికి అధికారులు క్యూ కడుతున్నారని బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ మండిపడ్డారు. ఏళ్ల తరపడి ఒకే స్థానంలో అధికారులు పాతుకు పోయారని, పలుకుబడితో అధికారులు వందల కోట్లు తింటున్నారని, జలగల లెక్క పట్టి పిడిస్తున్నారని, ఏళ్ళ తరపడి ఉన్న అధికారులను పంపే విధంగా తీర్మానం చేయాలని, వాటర్ వర్క్స్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవ్వరినీ లెక్క చెయ్యడం లేదని, జిహెచ్ఎంసిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడిందని శ్రవణ్ సూచించారు.

2024-25 సంవత్సరానికి గాను మొత్తం జిహెచ్ఎంసి బడ్జెట్ 8437 కోట్లు

రెవిన్యూ ఆదాయం : 5938 కోట్లు
రెవెన్యూ వ్యయం :- 3458 కోట్లు

రెవెన్యూ మిగులు : 2,480 కోట్లు

కాపిటల్ నిదులు : 1,999 కోట్లు

కాపిటల్ వ్యయం : 4,479 కోట్లు

హౌసింగ్: 500 కోట్లు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News