26 రోజుల్లో రూ.473 కోట్లు
ఆస్తి పన్ను వసూళ్లు
మరో 4 రోజులే గడువు
రూ.600 కోట్లుపై అధికారుల ఆశాభావం
హైదరాబాద్: ఎర్లీబర్డ్ పథకంతో జిహెచ్‌ఎంసికి కాసులవర్షం కురుస్తోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగానే ఆస్తిపన్న చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద జిహెచ్‌ఎంసి 5 శాతం రాయితీ ఇస్తోంది. గత 5 ఏళ్లుగా జిహెచ్‌ఎంసి ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రతి ఏటా నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈనెల 1వ తేదీనుంచి 30వ తేదీ వరకు ఎర్లీబర్డ్ పథకాన్ని జిహెచ్‌ఎంసి అమలు చేస్తోంది. దీంతో పథకం కింద గడిచిన 26 రోజుల్లో ఇప్పటీ వరకు 5,42,986 ఆస్తులకు సంబంధించి రూ.473 కోట్లు ఆస్తిపన్నును నగరవాసులు ముందస్తుగానే చెల్లించారు. తుది గడువు నాటికి రూ.590 కోట్ల నుంచి 600 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచన వేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనే గత ఏడాది ఎర్లీబర్డ్ కింద రూ.580 కోట్లు రావడంతో ఈ ఏడాది మరింత అధికంగా రావచ్చనే అంచనలో అధికారులు ఉన్నారు. దీంతో ఏ ఏడాది మొత్తం కలిపి ప్రతి ఏటా రూ.1500 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూళ్లు అవుతుండగా, ఇందులో కేవలం నెల రోజుల్లోనే రూ.600 కోట్లకు వరకు రావడం గమన్హారం.
ఎర్లీబర్డ్‌కు 4 రోజులే గడువు
ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపుకులకు సంబంధించి ఎర్లీబడ్ పథకం కింద 5 శాతం రాయితీని కల్పిస్తోందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులు నగరవాసులకు సూచించారు. 202223 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవారి కోసం ఎర్లీబర్డ్ కింద ప్రభుత్వం 5 శాతం రాయితీని కల్పించిందన్నారు. ఈ పథకం మరో 4 రోజులతో ముగనున్నందున్న వెంటనే ఆస్తిపన్ను చెల్లించడం ద్వారా 5 శాతం రిబేట్‌ను పొందవచ్చాని అధికారులు తెలిపారు. ఈ నెల 30తో ముగనుందని దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. గత ఈ నెల 1 నుంచి అమలు చేస్తున్న పథకానికి సంబంధించి నగరంలో ప్రతి ఆస్తిపన్నుదారుడికి ఎర్లీబర్డ్ పథకాన్ని సంబంధించి సెల్‌పోన్ల ద్వారా ప్రతి రోజు సంక్షిప్త సందేశం పంపిస్తున్నామని అధికారులు వెల్లడించారు. గడిచిన 26 రోజుల్లో నగరవాసులకు నుంచి విశేష స్పందన ఉందనితెలిపారు. ఇప్పటీ వరకు ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుల రూపంలో రూ.473 కోట్ల ఆదాయం వచ్చిందని ఈ మిగిలిన 4 రోజుల్లో మరో రూ.100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు వస్తుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేశారు.