Monday, January 20, 2025

ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

GHMC employee arrested by ACB

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని ఎల్‌బి నగర్ జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బండారి రమేష్ కుమార్ మంగళవారం రూ. 13,500 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా హస్తినాపురానికి చెందిన కాంట్రాక్టర్ బూక్య రామకృష్ణ తన పెండింగ్ బిల్లుల కోసం ఎల్‌బి నగర్ జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ బండారి రమేష్ కుమార్‌ను సంప్రదించాడు. దీంతో పెండింగ్ బిల్లులు మొత్తాలు రిలీజ్, ప్రాసెసింగ్ చేసేందుకు తనకు రూ. 25వేలు లంచం ఇవ్వాలని బండారి రమేష్‌కుమార్ డిమాండ్ చేశాడు.

దీంతో రూ. 13,500 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ బూక్య రామకృష్ణ ఈ విషయాన్ని ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి కార్యాలయం వద్ద సదరు అధికారి బండారి రమేష్ ఫిర్యాదు దారుడు బూక్య రామకృష్ణ నుంచి రూ. 13,500 తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుని చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించి రూ. 13,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. లంచం కేసులో పట్టుబడిన బండారి రమేష్‌కుమార్‌ను నాపంల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా నిందితునికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News