Friday, December 20, 2024

‘గ్రేటర్’ నిర్లక్ష్యం!

- Advertisement -
- Advertisement -

అధికారుల నిర్లక్షంతో మహానగరంలోని చెరువుల్లో ఆక్రమణలకు ఆస్కారం ఏర్పడుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటు రెవెన్యూ, అటు ఇరిగేషన్ అధికారుల పట్టింపులే ని ధోరణి వల్ల జిహెచ్‌ఎంసి పరిధిలోని చెరువుల్లో కి నిర్మాణాలు చొచ్చుకువస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని చెరువులకు ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ల హద్దుల నిర్ధారించలే ని పరిస్థితిలో ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలున్నా యి. చెరువులకు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల హద్దుల ను ఖరారు చేస్తే.. తమ వద్దకు బిల్డర్లు, రియల్టర్లు ఎన్‌ఓసికి రారనే ఉద్దేశ్యంతోనే ఆ విభాగాలు హ ద్దులను ఖరారు చేయడంలేదనేది ప్రధాన ఆరోపణ. జీహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 185 చెరువులు ఉంటే.. అందులో ఎఫ్‌టిఎల్ హద్దులను 55 చెరువులకే నిర్ణయించారనీ, మరో 130 చెరువులకు ఎఫ్‌టిఎల్ హద్దులను ఖరారు చేసేట్టుగా, ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని గ్రేటర్ అధికారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. చెరువులున్న జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినా వారి నుంచి ఆశించిన మేర స్పందనలేకుండా పోతోందనేది గ్రేటర్ అధికారుల్లోని అభిప్రాయం.

మిషన్ కాకతీయలో..
చెరువులను సుందరీకరించడం, పునరుద్ధరించే సన్నాహాలు చేసుకుని మొత్తం 19 చెరువులకు రూ. 282.60 కోట్లను కేటాయించి పనులు చేపట్టింది. ఈ 19 చెరువుల్లోనూ 10 చెరువుల పనులే మిషన్ కాకతీయలో పూర్తిచేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. మరో 9 చెరువుల పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయనేది అధికారుల్లోని అభిప్రాయం. నిధులు లేకపోవడంతో 9 చెరువుల అభివృద్ది పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. చెరువులను పునరుద్ధ్దరించేందుకు నిధులను కేటాయించాలని గతంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసి అభ్యర్థలను పంపినా నిధులు మాత్రం రాలేదనేది అధికార వర్గాల సమాచారం. దీంతో చెరువులను దత్తతకిచ్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయనీ వారు పేర్కొంటున్నారు. కొన్ని చెరువులను సిఎస్‌ఆర్ పద్దతిలో దత్తతకు ఇవ్వడం జరిగిందనీ, వాటిని దత్తత తీసుకున్న చెరువుల్లో 29 చెరువుల సంరక్షణ బాధ్యత పలు రియల్ సంస్థలకు కేటాయించినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సిసి కెమెరాలతో నిఘా..
గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈమేరకు చెరువుల్లోకి ఆక్రమణలు, ఘనవ్యర్థాలను పడేయడం, నిర్మాణాలు చేపట్టడం వంటివి అరికట్టేందుకు ప్రతి చెరువుకు సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కూకట్‌పల్లి జోన్ పరిధిలోని 42 చెరువులకు 383 కెమెరాలను, శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని 69 లేక్‌లకు 318 సిసిటివి కెమెరాలను, ఎల్‌బీనగర్ పరిధిలోని 20 నీటి వనరులకు 153 కెమెరాలు, చార్మినార్ పరిధిలోని 25 చెరువులకు 142 కెమెరాలు,

ఖైరతాబాద్ పరిధిలోని19 చెరువులకు 142 కెమెరాలను, సికింద్రాబాద్ జోన్‌పరిధిలోని 4 చెరువులకు 32 కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు జీహెచ్‌ఎంసి అన్ని ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెట్టింది. కెమెరాకు అవసరమయ్యే విద్యుత్ కోసం సౌర విద్యుత్ విధానాన్ని అందించేట్టుగా ప్రణాళికను సిద్దంచేస్తుంది. ఇటు జీహెచ్‌ఎంసి చెరువుల్లో ఆక్రమణలు రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంటే.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మాత్రం చెరువులకు ఎఫ్‌టిఎల్ హద్దులను ఏర్పాటు చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News