ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరంలో చెత్త సేకరణకు మరింత అత్యాధునిక స్వచ్ఛ ఆటో టిప్పర్లు వచ్చేశాయి. తద్వారా చెత్త సేకరణలో జిహెచ్‌ఎంసి మరో మైలు రాయిని అధిగమించనుంది. ప్రస్తుతం ఉన్న 2500 ఆటోలకు అదనంగా 1.5 మెట్రిక్ టన్నుల (3.3 క్యూబిక్ మీటర్స్) సామర్ధం గల 650 ఆటోలను తీసుకువచ్చారు. 350 ఆటోలను ( నేడు ) గురువారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు నెక్లెస్ రోడ్‌లోని డాక్టర్ కార్స్ ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
డ్రైవర్ కమ్ ఓనర్ విధానంలో పంపిణీ
స్వచ్ఛ ఆటో టిప్పర్లను సైతం డ్రైవర్ కబ్ ఓన ర్ విధానంలోనే పంపిణీ చేయనున్నారు. 650 ఆటోలకు సంబంధించి రూ.44,63,55,650లు వ్యయం కాగా, ఈ రుణాన్ని కెనరా బ్యాంక్ అంద జేసింది. ఒక్కో ఆటో ధర రూ.6,86,701 కాగా ఇందులో 10 శాతం వాటాను లబ్ధ్దిదారులు చెల్లిం చనుండగా మిగిలిన 90 శాతం రుణాన్ని 8శాతం వార్షిక వడ్డీతో 72 నెలలలో కెనరా బ్యాంక్‌కు జిహె చ్‌ఎంసి చెల్లించనుంది. ఈ స్వచ్చ ఆటోల్లో తడి పోడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక ంగా ఏర్పాటు చేశారు. 2016లో నగర వ్యాప్తంగా 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా 2017 నాటికి 4500 మెట్రిక్ టన్నులు, ప్రస్తుతం 6500 మెట్రిక్ టన్నులు చెత్త వెల్లువడుతోంది. నగరం అంతకు అంతా విస్తరించడంతో కొత్త ఆటో లకు ఆయా ప్రాంతాలకు కేటాయించనున్నారు. మొత్తం 30 సర్కిళ్లకు మొదటి దశ కింద ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఈ ఆటోల ద్వారా ప్రతి రోజు 600 ఇళ్ల నుంచి చెత్తను సేకరించనున్నారు.