Monday, December 23, 2024

జిహెచ్‌ఎంసి ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలు

- Advertisement -
- Advertisement -

GHMC Inter Circle Sports Competitions

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాల్లో భాగంగా సోమవారం పలు జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో వాలీబాల్, బాస్కెట్ బాల్ క్రీడాల్లో ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్ జరిగింది.సిఐబి క్వార్టర్స్, షేక్‌పేట్ జట్టు మధ్య, విపిజి, హెచ్‌వైడి స్పైకర్ జట్ల మధ్య బాయ్స్ వాలీబాల్ పోటీలు జరిగాయి ఈ పోటీల్లో సిఐబిపై షేక్‌పేట్ జట్టు, హెచ్‌వైడి స్పైకర్ జట్టుపై విపిఐ జట్టు విజయం సాధించాయి. అదేవిధంగా బాలికల మధ్య జరిగిన వాలీ బాల్ పోటీల్లో షేక్‌పేట్ జట్ల హెచ్‌వైడి మేయర్స్ జట్టుపై విజయం సాధించింది. వెంకటేశ్వర కాలనీ, రహీంపురా జట్ల మధ్య బాయ్స్ బాస్కెట్ బాల్ పోటీలో రహీంపుర జట్టుపై వెంకటేశ్వర కాలనీ టీమ్ విజయం సొంతం చేసుకుంది. అదేవిధంగా సనత్‌నగర్, వెంకటేశ్వర కాలనీ జట్ల మధ్య జరిగిన పోటీలో సనత్‌నగర్ జట్టు గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News