Sunday, January 19, 2025

గ్రేటర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు జిహెచ్‌ఎంసి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : గ్రేటర్ అభివృద్ధ్ది జిహెచ్‌ఎంసి మరిన్ని చర్యలు చేపట్టింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలోప్రజలకు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ పలు అభివృదిధ్ద పనులకు ఆమోద ముద్ర వేసిం ది. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో బుధవారం మే యర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాం డిం గ్ కమిటీ సమావేశంలో 18 అంశాలు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడు తూనగర అభివృద్ధ్దికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

ఎంత ఖర్చుకైనా వెనకకుండా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నేడు బ క్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులకు మేయర్ ఈద్ ముబారక్ తెలిపారు. పండుగను భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలని కోరారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా నగరంలో రోడ్లు, మజీద్‌లను శుభ్రం చేయాలని, రోడ్లపై పే రుకుపోయిన చెత్తను వెంట వెంటనే తొలగించేందుకు అ న్ని చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ లనుఆదేశించా రు.

ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయి జెన్ శేకర్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, సమీనా బే గం, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ అబ్దుల్ ముక్తర్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ఆర్. సునిత, టి. మహేశ్వ, క మిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ ప్ర కాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జ యరాజ్ కెనడి, సిసిపి దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పంకజ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మమత, సామ్రాట్ అ శోక్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆమోదత ప్రధాన అంశాలు :
* సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో రూ. 6కోట్ల వ్య య ంతో తలపెట్టిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను అక్కడి ను ండి రామ్ గోపాల్ పేట్ డివిజన్‌లోని పాన్ బజార్ 450 గజాల ఖాళీ స్థలంలో నిర్మించేందుకు రూ.4.90కోట్ల రి వైజ్డ్ అంచనా వ్యయానికి కమిటీ ఆమోదం.

* కల్పతరువు రెసిడెన్సీ నుండి తిరుమల కాన్వెంట్ స్కూ ల్ వరకు (కారిడార్ 2 మిస్సింగ్ లింక్ రోడ్డు నుండి భర త్ నగర్‌ఆర్ ఓబి నుండి హైటెక్స్ రోడ్డు నుండి వయా మో తి నగర్ బోరబండ, మల్లాపూర్) వరకు 30 ఫీట్ల రోడ్డు వెడల్పుకు 306 ఆస్తుల సేకరణ ప్రభుత్వ అనుమతికి క మిటీ ఆమోదం.

* ఎయిర్ పోర్ట్ రోడ్డు నుండి వయా సిటడెల్ హోటల్, క న్వెన్షన్ మీదుగా దివ్యశక్తి ప్రైవేట్ లిమిటెడ్ వరకు 12 మీటర్ల (40 ఫీట్ల) రోడ్డు వెడల్పుకు సంబంధించి ప్ర భు త్వ ఆదేశాల మేరకు హెచ్.ఎండి.ఎ జోన్‌లో గల రా జేం ద్ర నగర్ మండలం గగన్ పహాడ్ గ్రామంలో 15 ఆస్తుల సేకరణకు ప్రభుత్వా అనుమతికి కమిటీ ఆమోదం.

* రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా బొల్లారం వద్ద ఆర్ ఓ బి నిర్మాణంతో పాటుగా కొంపల్లి నుండి స్టీవర్ట్ రో డ్డు వరకు వయా బొల్లారం నుండి కలవరి స్టేషన్ మీ దు గా 24, 42 మీటర్ల రోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్ లో క లి పి ప్రభుత్వానికి నివేదించడంతో పాటు బొల్లారం కలవ రి స్టేషన్ నుండి స్టీవర్ట్ రోడ్డు వరకు చేపట్టే రోడ్డు స్ట్రెచ్ కు 106 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
* బల్కంపేట్ నుండి వయా నేచర్ క్యూర్ హాస్పిటల్ మీ దుగా అమీర్ పేట్ లాల్ హౌస్ బంగ్లా, శ్యామ్ కరణ్ వ ర కు 18 మీటర్ల రోడ్డు విస్తరణ సందర్భంగా 136 ఆస్తుల సేకరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదం.

* చింతల్ ఐడిపిఎల్ క్రాస్ రోడ్డు వద్ద పురపాలక పట్టణ అభివృద్ధి సంస్థ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మరుగుదొడ్లు నిర్మాణం 14 ఏళ్ల పాటు వాటి నిర్వహణ లో భాగంగా యూజర్ చార్జీల వసూళ్లకు సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్‌తో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ ఒప్పందానికి కమిటీ ఆమోదం.

* సికింద్రాబాద్ జోన్‌లోని బషీర్ బాగ్ విజయ జ్యువలరీ స్ ఎదురుగా, వైఎంసిఎ నారాయణగూడ, 3.చే నంబర్ – జంక్షన్, 4.మోండా మార్కెట్ ఓల్డ్ జైల్ పార్కింగ్ వద్ద, శేరిలింగంపల్లి జోన్‌లోని కొండాపూర్ టెలికాం నగర్‌లో గల హ్యుందాయ్ షోరూం ఎదురుగా మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర, అదే విధంగా ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్ జంక్షన్ మెట్రో స్టేషన్ ఎదురుగా, ఉప్పల్ బస్ స్టాండ్ వె నుక బాగంలో, వనస్థలిపురండి-మార్ట్ సుష్మా థియేటర్ వ ద్ద ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ (ఫ్లైఓవర్ కింద), కొత్తపేట సి గ్నల్ ఓల్డ్ కోర్టు దగ్గర, ల్గొండ ఎక్స్ రోడ్ అల్ నూర్ మజీ ద్ డిఆర్‌డిఓ వాల్, కంచన్ బాగ్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ దగ్గర సిఎస్‌ఆర్ పద్ధతిలో మల్టీ పర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూం నిర్మాణం 14ఏళ్ల నిర్వహణకు గాను అర్బన్-లూ సంస్థతో ఒప్పందానికి సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్‌బినగర్, చార్మినార్ జోనల్ కమిషనర్లకు అధికారం ఇస్తూ కమిటీ ఆమోదం.

* ఖైరతాబాద్ జోన్‌లోని నాంపల్లి స్టేషన్, బేగం బజార్ ఫిష్ మార్కెట్, మెహదీపట్నం బస్ స్టాప్, అబిడ్స్ జిపిఓ వద్ద, కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్, కింగ్ కోటి లాస్ట్ గేట్ బస్ స్టాప్, టోలిచౌకి ఫ్లై ఓవర్ వద్ద సి ఎస్ ఆర్ పద్ధతి టాయిలెట్ నిర్మాణం, 14 ఏళ్ల పాటు నిర్వణకు అర్బన్-లూ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కు అధికారం ఇస్తూ కమిటీ ఆమోదం తెలిపింది.

* శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో గల ఈర్ల చెరువు 330 మీటర్ల బాక్స్ డ్రైన్ ద్వారా డ్రైనేజ్ డైవర్షన్ , చెరువు యొక్క నిర్మాణం ఇంటెక్ డైవర్షన్ చేయ డం కోసం 21 -3-2023 న జరిగిన స్టాండింగ్ కమిటీ సివరేజ్ మళ్లింపు పైప్ లైన్ కోసం రూ. 2.63కోట్ల పరిపాల న అనుమతి రద్దు చేస్తూ బాక్స్ డ్రైన్ ద్వారా డ్రైనేజ్ మ ళ్ళించే పనిని చేపట్టుటకు షార్ట్ టెండర్ పిలువడానికి అనుమతికి కమిటీ ఆమోదం.
* మదీనగూడ మండలం ఈర్ల చెరువు (రీచ్-2) 330 మీ టర్ల నుండి 720 మీటర్ల వరకు చేపట్టే డ్రైనేజ్ మళ్లింపు ప నికి రూ.2.78 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు షార్ట్ టెండర్ పిలువడానికి కమిటీ ఆమోదం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News