Saturday, February 22, 2025

యువతితో అక్రమ సంబంధం… జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ కు దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ జానకిరామ్ ను అతడి కుటుంబ సభ్యులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో జానకిరామ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారాసిగూడలో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో జానకిరామ్ ఉంటున్నాడు.  భర్త జానకిరామ్ గత కొన్ని రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో, ఎక్కడికి వెళుతున్నాడని భార్య నిఘా పెట్టింది. ఇద్దరు కలిసి ఉండగా తన బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని భర్త, ప్రియురాలికి దేహశుద్ధి చేశారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడని భార్య కళ్యాణి ఆరోపణలు చేసింది. వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News