Sunday, November 17, 2024

అంతయ్య మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనస్థలిపురం: మ్యాన్‌హోల్‌లో పేరుకపోయిన మట్టిని తొలగించేందుకు వెళ్లి మంగళవారం మృతిచెందిన అంతయ్య మృతదేహం ఆచూకీ కోసం గత రెండు రోజుల నుంచి మున్సిపల్, పోలీసు ఫైర్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి గురువారం సాయంత్రం వరకు ఎలాంటి అనవాలు లభించకపోవడంతో మృతుని బంధువులు నిరాశకు గురవుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం, బిఎన్‌రెడ్డి నగర్ డివిజన్ సాహెబ్‌నగర్ పరిదిలోని పద్మావతి కాలనీలో మ్యాన్‌హోల్‌లో పేరుక పోయిన మట్టిని తొలగించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ వరికుప్పల స్వామి సూపర్‌వేజర్ విజయ్ చెప్పడంతో సూపర్‌వేజర్ చంపాపేట్‌లోని నీళం రాజశేఖర్‌రెడ్డి నగర్ కాలనీకి చెందిన మృతులు శివ కుమార్, అంతయ్యలతో పాటు సునిల్ రమేష్‌లను సాహెబ్‌నగర్‌లోని పద్మావతి నగర్ కాలనీ శ్రీనివాస్ ఇంటి ముందు ఉన్న మ్యాన్‌హోల్‌లో మట్టిని తొలగించేందుకు తీసు కవచ్చారు.

రాత్రి 10 గంటల ప్రాంతంలో మ్యాన్‌హోల్ మూతను తీసిన మృతుడు శివ కుమార్ తన వెంట తెచ్చుకున్న నిచ్చెన ద్వారా మ్యాన్‌హోల్‌లోకి దిగగానే విషపూరితమైన వాసన భరించలేక స్పహతప్పి నిచ్చెనలో కాళ్లు ఇరుక్కొని పోయి తలబాగం మురికి నీటిలో పడి ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న శివకుమార్ అంతయ్యను రక్షించు రక్షించు అంటూ కేకలు వేయగా అంతయ్య శివ కు మార్‌ను రక్షించేందుకు నిచ్చెన ద్వారా మ్యాన్‌హోల్ లో దిగి శివను కాపాడేందుకు ప్రయత్నించగా మ్యాన్‌హోల్‌లోని గ్యాస్ వలన ఉక్కిరిబిక్కిరి అయి స్వాస అడకపోవడంతో కాలువలో పడిపోయాడు. దీంతో పైన ఉ న్న సునిల్, రమేష్‌లు చనిపోయిన శివకుమార్ నిచ్చెన ద్వారా బయటకు తీశారు. అంతయ్య మృత దేహం కోసం మ్యాన్‌హోల్ లోని పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ అంతయ్య మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం రాత్రి నుంచి ఇటాస్, జెసిబిల ద్వారా మ్యాన్‌హోల్ పైపులను తొలగించినప్పటికి అంతయ్య మృతదేహం గురువారం ఉదయం వరకు లభించకపోవడంతో హయత్‌నగర్‌లోని కుంట్లూర్, పసుమాముల పరిసర ప్రాంతాలలో వెతికినా అంతయ్య మృతదేహం ఆచూకీ లభించలేదు. చివరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌తో పాటు మున్సిపల్ ఇంజినీరింగ్, పోలీసు అధికారులతో పసుమాముల, కూంట్లూర్ చెరువులలో అంతయ్య మృతదేహం ఆచూకీ కోసం బోట్‌లను ఏర్పాటు చే సి వెదకడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌యస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
ప్రతి పక్షపార్టీలు సహకరించాలి.. విమర్శలు మానుకోవాలి : సుధీర్ రెడ్డి
మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందిన అం తయ్య మృతదేహం ఆచూకీ కోసం గత రెండు రోజుల నుంచి రాత్రింబవళ్లు శ్రమింస్తుంటే ప్రతి పక్ష పార్టీలు ఈ సమయంలో అధికారులకు సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దెవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. గురువారం బిఎన్ రెడ్డి నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ అంతయ్య మృతదేహం కో సం సాహెబ్‌నగర్ నుంచి హయత్‌నగర్ పరిధిలోని పసుమాముల, కుంట్లూర్ చెరువు వరకు ఉన్న మ్యాన్‌హోల్ పైపులతో పాటు రెండు చెరువులలో అంతయ్య మృతదేహం ఆచూకీ కోసం వెతకడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అంతయ్య మృతదేహం ఆచూకీ దొరికే వరకు అధికారులతో పాటు ఎమ్మెల్యేగా బాధ్యతను నిర్వర్తింసున్నానని పేర్కొన్నారు. పతిపక్ష పార్టీలు విమర్షలు మానుకొని అంతయ్య మృతదేహం ఆచూకీ దొరికే వకరు సహకరించాలని బిజేపి, కాంగ్రెస్ నాయకులను కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటి డైరెక్టర్ అనిల్ చౌదరి, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

GHMC Manhole death: Search still on for Anthayya dead body

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News