మనతెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో వర్షం మొదలు కాగానే టెలి కాన్ఫరేన్స్ ద్వారా జోనల్ కమిషనర్ ల తో మాట్లాడారు. కూకట్‌పల్లి జోనల్ మమతా తో మాట్లాడిన మేయర్ అయోధ్య నగర్ లాంటి ఏరియా లలో నీరు నిలవకుండా చూడండి అన్నారు ఖైరతాబాద్ జోనల్ వెంకటేష్ తో మాట్లాడుతూ బల్కంపేట, మయూరి మార్గ్ లాంటి ప్రదేశాలలో నీరు నిలవకుండా చూడండి అదేశించారు.
శేరి లింగంపల్లి జోనల్ శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడుతూ మాధాపూర్ , చందానగర్ లాంటి ఏరియా లలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఎల్ బీ నగర్ జోనల్ కమిషనర్ పంకజా తో మాట్లాడుతూ నాగోల్ లాంటి ఏరియా లలో నీటి నిల్వలు ఉండకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ తో మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు . చార్మినార్ జోనల్ లో తాజా పరిస్థితులను వెంకన్న ను అడిగి తెలుసుకున్నారు.
అనాధికారికంగా మ్యాన్ హోల్స్ ఓపన్ చేస్తే కఠిన చర్యలు: కమిషనర్
మ్యాన్ హోల్ , క్యాచ్ పిట్ కవర్లను ఎవరు ఓపెన్ చేయవద్దని జిహెచ్‌ఎంసి పరిధిలోని కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. వరదలు వచ్చి రోడ్డుపై నీరు నిలిచినప్పుడు మాన్ హోల్స్ మూతలు తెరిచి ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అనధికార వ్యక్తులు మాన్ హోల్స్ మూతలను తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చ రించారు.వరద నీటి సమస్యలు ఉంటే జిహెచ్‌ఎంసి హెల్ప్ లైన్ నంబర్ 040- 2111 1111 కు సంప్రదించాలని సూచించారు. .జిహెచ్‌ఎంసి సిబ్బంది మ్యాన్ హోల్స్ క్యాచ్ ఫిట్స్ మూతలు ఓపెన్ చేసి దానిని క్లీన్ చేసి మళ్లీ వాటిని మూసి వేస్తారుప్రైవేటు వ్యక్తులు ఓపెన్ చేసి వదిలి వేయడం వల్ల తెలియని వారు మాన్ హోల్స్ లో పడిపోయి మరణించే అవకాశం ఉంది…పౌరులందరూ ఈ విషయంలో సహకరించవలసిందిగా జిహెచ్ ఏం సి కమిషనర్ కోరారు