హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలతో దేశంలోని మెట్రో నగరాల అభివృద్దిలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉండనుందని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నగర అభివృద్దిలో భాగంగా మురుగు నీటి శుద్దీకరణకు రూ.3366 కోట్లు , నగరవాసుల మంచినీటి అవసరాల కోసం రూ.1200 కోట్టు ఒక్కరోజే రూ.5000 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావులకు జిహెచ్‌ఎంసి తరుపున నగరవాసులు, గ్రేటర్ ప్రజా ప్రతనిథుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నమన్నారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని పన్వర్ లాల్‌హాల్‌లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొ రేటర్లు మన్నే కవిత, వనం సంగీత యాదవ్, మాధవరంరోజాదేవిలో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి సంబంధించి రానున్న 15 ఏళ్ల నాటికి పెరుగనున్న జనాభా అవసరాల దృష్టిలో పెట్టుకుని అతి ముఖ్యమైన మురుగునీటి శుద్దీకరణతో పాటు మంచి నీటి అవసరాలకు రూ.5వేల కోట్లు మంజూరు చేయడం సంతోషించ దగ్గ విషయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని పార్లీ ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 1650 ఎంఎల్‌డి మురుగు నీరు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 25 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా 772(ఎంల్‌డి) ( 46.78 శాతం)ఈ మురుగు నీరు మాత్రమే శుద్దీ చేయబడుతోందన్నారు. మిగిలిన 878 ఎంల్‌డిల (100 శాతం) శుద్ద చేయడమే లక్షంగా మరో 31 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు గాను ప్రభుత్వం రూ.3866.21 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. మురుగు నీరుతో పాటు రానున్న 15 ఏళ్ల నాటికి వెలువడనున్న మరో 1259 ఎంఎల్‌డి మురుగునీరు ఈ ట్రీట్‌మెంట్ సంబంధించి నిర్మిస్తున్న ప్లాంట్లను రానున్న 2 ఏళ్ల లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేయర్ వెల్లడించారు.
ప్రస్తుతం శుద్ది చేస్తున్న మురుగు నీరు నగర అవసరాల కోసం వినియోగిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున నీరు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వినియోగానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను సైతం సిద్దం చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 31 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను 40 శాతం ప్రభుత్వ నిధులు, 60 శాత్రం ప్రైవేట్ సంస్థల నిధులను వెచ్చించనున్నాయన్నారు. ఈ రెండేళ్లలో పూర్తి చేయనున్న ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఆ తర్వాత 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలే నిర్వహించనున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ట్రీట్‌మెంట్ నిర్వహణకు సంబందించి ప్రభుత్వం ఫీజును చెల్లిస్తుందని మేయర్ వెల్లడించారు. అదేవిధంగా ఓఆర్‌ఆర్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజల మంచినీటి అవసరాలకు తీర్చేందుకు కేటాయించిన రూ.1200 కోట్ల నిధులతో కొత్తగా 2లక్షల నీటి కనేక్షన్ల ఇవ్వనున్నమని తద్వారా 20 లక్షల కుటుంబాలకు మేలు జరగనుందని మేయర్ వెల్లడించారు. ఈసమావేశంలో జలమండలి అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.