Sunday, January 19, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికే వార్డు పరిపాలన: మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా సమస్యలనునిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు వార్డు పారిపాలన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మితెలిపారు. వార్డు కార్యాలయంప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం మేయర్ మాట్లాడుతూ మెరుగైన పాలనతో సంక్షేమం, అభివృద్ధిలో ఇప్పటికే ముందంజలో ఉన్నామని, మరింత సుపరిపాలన అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా జిహెచ్‌ఎంసి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వార్డు వ్యవస్థను అమల్లోకితెచ్చిందన్నారు.. ప్రధాన కార్యాలయం, జోన్, సర్కిల్ కార్యాలయాల మాదిరిగానే వార్డు కార్యాలయాలను సిటీజన్స్ చాట్ ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వార్డు కార్యాలయాలన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు.

ఇక్కడ వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ఆఫీసర్, వార్డు ఇంజనీర్, వార్డు యు.బి.డి సూపర్ వైజర్, విద్యుత్, శానిటరీ జవాన్, టౌన్ ప్లానర్, కమ్యునిటీఆర్గనైజర్, జలమండలి, ఎంటమాలజీ, కంప్యూటర్ ఆపరేటర్ లతో కూడిన పది మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయాలచుట్టూ తిరగకుండా అన్ని శాఖల సిబ్బంది తో వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. వార్డు వ్యవస్థలో ప్రజా సమస్యలను కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా రిజిస్టర్ చేయబడి సంబంధిత శాఖ అధికారికివెంటనే ఫార్వర్డ్ చేయబడుతుంది. సిటీజన్ చార్టర్‌ను అనుసరించి సమస్యలనుసత్వరమే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్య పరిష్కారంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. వార్డు వ్యవస్థ కొలువు తీరడానికి కొంచెం సమయంపడుతుందని ఆ తర్వాత పూర్తిస్థాయిలో పని చేస్తుందని మేయర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News