హైదరాబాద్: బంజారాహిల్స్ డివిజన్‌లో జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గురవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు మరిన్నింటికి శంకుస్థాపనలు చేశారు. తన సొంత డివిజన్ అయిన బంజారాహిల్స్‌లో రూ.2 కోట్ల పై చిలుకు వ్యయంతో కూడిన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్దిపథంలో దూసుకుపోతుందన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కె.తారక రామారావు మార్గ నిర్ధేశంలో వేల కోట్లు నిధులతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందన్నారు.
అంతకు ముందు బంజారాహిల్స్ లోని ఫోటో గ్రాఫర్స్ కాలనీలో రూ.16.5 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మేయర్ ప్రారంభించారు. అదేవిధంగా అదేవిధంగా ఎమ్మెల్యే కాలనీలో సురేష్‌రెడ్డి ఇంటి వరకు రూ.18 లక్షలు, విడిసిసి రోడ్డు, ఎమ్మెల్యే కాలనీలోనే రూ.9.6 లక్షలతో మరో రోడ్డు, లోటస్ ఫౌండ్ వద్ద రూ.19.5 లక్షలు, మోర్ మెడికల్ వద్ద రూ.15లక్షలతో దోబిఘాట్, నిర్మాణం, శ్రీరాంనగర్‌లో రూ.3.8 లక్షలతో రోడ్డు, బౌలనగర్‌లో రూ.6లక్షలతో సిపి రోడ్డు, ఉదయ్ నగర్‌లో రూ.7.5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, డివిజన్‌లో రూ.1.2 కోట్లతో సివరెజి, మంచినీటి పైంపు లైన్ల పనుకుల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోన్ ఇంచార్జీ జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో పాటు జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ సేవనాయక్, మెడికల్ ఆఫీసర్ రవికాంత్, ఈఈ విజయకుమార్, వాటర్ బోర్డు మేనేజర్ హరిశంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Inaugurated GHMC community hall in Press Photographers Colony, BANJARA HILLS division along with @DC_JubileeHills and other @GHMCOnline officials. @KTRTRS @trspartyonline pic.twitter.com/wCU7Gn4eJL
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) October 7, 2021