Monday, December 23, 2024

అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

GHMC Mayor lays foundation stone for development works

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిశుక్రవారం బంజారా హిల్స్ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని తట్టిఖాన సెక్షన్ రిజర్వాయర్ డివిజన్ -6 కింద రూ. 20 లక్షల వ్యయంతో చేపడుతున్న మంచినీటి, మురుగునీటి పైప్ లైన్ పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా శ్రీరాంనగర్ రోడ్ నెం-12, బంజారా వ్యాలీ రోడ్ నెం-13 బంజారాహిల్స్ డివిజన్ రూ. 20 లక్షల తో గార్లిక్ ఫ్యాక్టరీ నుండి శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ వరకు 100 ఎం.ఎం డయా వాటర్ పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. ఎఆర్‌వి ప్రైజెస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ మినిస్టర్ క్వాటర్స్ రోడ్ నందు 100 ఎమ్ ఎమ్ డి 1 వాటర్ సప్లై ను, శ్రీరామ్ నగర్ బంజారాహిల్స్ వద్ద 200 ఎం.ఎం డయా సీవరేజ్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి జి.ఎం హరిశంకర్, తట్టిఖాన సెక్షన్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News