Monday, December 23, 2024

చెరువుల పరిరక్షణకు జిహెచ్‌ఎంసి చర్యలు

- Advertisement -
- Advertisement -

GHMC measures for conservation of ponds

రూ.95.94 కోట్లతో 61 చెరువుల అభివృద్ది

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు జిహెచ్‌ఎంసి మరిన్ని చర్యలు చేపట్టింది. చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతో పాటు చుట్ట పక్కల ఉన్న నివాసితులకు దుర్వాసన మురుగు నీరు మళ్లింపుతో పాటు వాటి సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ. 95.94 కోట్ల వ్యయంతో 61 చెరువుల అభివృద్దికి కార్యచరణను అధికారులు సిద్దం చేశారు. ఈ ప్రతిపాదిత చెరువుల అభివృద్దిలో భాగంగా చెరువుకట్టల బలోపేతం, తూముల(స్లూస్) పటిష్టతకు సంబంధించి పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

మరో రూ.94.17 కోట్ల వ్యయంతో 63 చెరువుల సుందరీకరణ 

నగరంలో రూ.94.17 కోట్ల వ్యయంతో మరో 63 చెరువుల అభివృద్ది ,సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చెరువుల సుందరీకరణ, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ట్ కట్ట బలోపేతం, ల్యాండ్ స్వేపింగ్, గ్రీనరీలో భాగం మొక్కలు నాటడం, ఇల్లుమినేషన్ తదితర పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 63 చెరువుల్లో 48 చెరువులు హుస్సెన్ సాగర్ లేక్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ పరిధిలో ఉండగా మిగిలిన చెరువులు జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ మేయింటనెన్స్ విభాగం పరిధిలో ఉన్నాయి. చెరువుల అభివృద్దికి సంబంధించి వాటర్ బోర్డ్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా 61.20 కోట్ల వ్యంతో 48 చెరువుల బలోపేతం, సుందరీకరణ, ఫెన్సింగ్ తదితర ప్రాధాన్యత పనులను చేపట్టగా ఇందులో ఇప్పటికే రూ.37 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగితా పనులు వివిధ ప్రగతి దశల ఉన్నాయి. అదేవిధంగా చెరువులను కాపాడడంతో పాటుగా సుందరీకరణ పనుల కోసం పలు స్వచ్చంధ సంస్థలు, ఆసక్తి గల సంస్థలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ స్వచ్చంధ సంస్థలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఇప్పటికే సిఎస్‌ఆర్ కింద 10 చెరువులను కార్పొరేట్ సంస్థలు చేపట్టగా, మరో 4 చెరువులు ఇచ్చేందుకు ఇటీవలే స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందించిన నేపథ్యంలో ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది.

గ్రేటర్ పరిధిలోని 180 చెరువుల బఫర్ జోన్లు సుందరీకరణ 

గ్రేటర్ పరిధిలోని 180 చెరువుల బఫర్ జోన్ల సుందరీకరణ లక్షంగా జిహెచ్‌ఎంసి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా గుర్తించిన 42 చెరువుల అభివృద్ది సుందరీకరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిహెచ్‌ఎంసి బడ్జెట్‌లో ఈ ఏడాది 10 శాతం గ్రీనరీ బడ్జెట్ రూ.384.80 కోట్లను కేటాయించారు. దీంతో నగర సుందరీకరణలో భాగంగా చేపడుతున్న వివిధ విన్నూత ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి గ్రీనరీ కార్యక్రమాలతో పాటు చెరువుల సుందరీకరణకు సైతం శ్రీకారం చుట్టారు. వాటికి తోడు గొలుసు కటు చెరువులను మరింత పటిష్టత పర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సైతం నగరంలో చెరువుల అభివృద్దికి దోహద పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News