Wednesday, January 22, 2025

వానలపై జిహెచ్ఎంసి హెచ్చరిక!

- Advertisement -
- Advertisement -

GHMC monsoon teams on alert

హైదరాబాద్: భారీ వానలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలటీ కార్పొరేషన్ అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జిహెచ్‌ఎంసి సూచించింది. గ్రేటర్‌లో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్షం నీటిని తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎన్డీపి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. హెల్ప్‌లైన్ నెం: 04 2111 1111ను జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసింది. నగరవాసులు మ్యాన్‌ హోల్స్ తెరవొద్దని జలమండలి హెచ్చరించింది. మ్యాన్‌హోల్స్‌ మూతలు విరిగినా, తెరచి ఉన్నా.. సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ వాటర్‌బోర్డ్ సూచించింది.

భారీ వర్షాల కారణంగా జిహెచ్ఎంసి హై అలర్ట్ ప్రకటించిన ముచ్చట తెలిసిందే. గత రెండ్రోజులగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాన శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా విస్తరించింది. శనివారం కూడా వర్షం భారీగా కురుస్తోంది. శనివారం ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పర్యటించారు. ఈ నేపథ్యంలో రసూల్ పురా నాలాపనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇదిలావుండగా మేయర్ జి. విజయలక్ష్మి శనివారం జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. యుద్ధప్రాతిపదిక వానకు సంబంధించిన ఇబ్బందులను తొలగించాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించాలని, తగిన చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని కూడా సూచించారు. మరో నాలుగు రోజులపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News