హైదరాబాద్: మన తెలంగాణ దినపత్రిక’లో ‘జీ స్క్వేర్ …షోకాజ్ బేఖాతర్’ కథనంపై జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించారు. బిఎన్ రెడ్డి నగర్‌లో భారీ ప్రచారంతో ఏర్పా టు చేసిన జీస్క్వేర్ లే ఔట్ అక్రమ ప్రహారీని, రోడ్డును కూల్చివేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిబంధనాలకు విరుద్ధంగా ప్రహరీగోడను నిర్మించిన ‘వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్’పై కఠిన చర్య లు తీసుకుంటామని జిహెచ్‌హెంసి టౌన్‌ప్లానింగ్ అధికారిణి (టిపి ఓ) ఉమ ‘మనతెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. ‘వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్’ తా ము ఇచ్చిన షోకాజ్ కు స్పం దించి మూడు పేజీల సంజాయిషీని అందించిందని ఆమె తెలిపారు.ఈ సంస్థ ఇచ్చిన సంజాయిషీని అన్ని కోణా ల్లో విచారిస్తున్నామ ని,తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
నిబంధనా లకు విరుద్ధంగా వ్యవహారిస్తే ఎవరినీ ఊపేక్షించేది లేదని ఆ మె తెలిపారు. ఆ సంస్థ ఇచ్చిన సంజాయిషీ ప్రతి ని ఇవ్వడానికి మాత్రం ఆమె నిరాకరించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో లే ఔట్‌లను చే స్తే కంపౌండ్ వాల్‌ను నిర్మించవద్దనే నిబం ధన ఉన్నా సదరు సంస్థ నిబంధనలను అ తిక్రమించి చేసిన లే ఔట్‌పై చర్యలు తీ సుకోవడంలో అధికారులు నిర్లక్షం వ హిస్తున్నారని ‘మనతెలంగాణ’లో వచ్చిన కథనానికి అధికారులు దిగివచ్చారు. ఇప్పటికే స్థానికులు ఈ లే ఔట్‌పై ఫిర్యాదులు చే స్తుండడం, పత్రికల్లో వరుస కథనాలు ప్ర చురితం కావడంతో అధికారులు దీనిపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు.