సిటీ బ్యూరో ః ప్రజాధనాన్ని జీతం రూపంలో లక్షల రూపాయాల తీసుకుంటున్న ఇంకా సరిపోన్నట్లు అవినీతికి అలవాటు పడిన కొంత మంది జిహెచ్‌ఎంసి అధికారులు , సిబ్బంది ప్రజలను జలగల్లా పట్టి పీల్చితున్నారు. ఇలాంటి అవినీతిపరుల ఆటను ఎసిబి అధికారులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా అవేమి పట్టనట్లు వ్యవహరించడం జిహెచ్‌ఎంసిలో సర్వ సాధారణమైంది. ఇదే క్రమంలో గురువారం ఎసిబి వలలో జిహెచ్‌ఎంసికి చెందిన రెండు అవినీతి చేపలు చిక్కాయి.
చార్మినార్ జోన్‌లోని చంద్రాయణ్‌గుట్ట సర్కిల్‌లో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రిచా తో పాటు కంప్యూటర్ అపరేటర్ సతీష్ లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుపడ్డారు. ఇదే సర్కిల్‌లో సివిల్ కాంట్రాక్టర్ అయినా ఓమర్ అలీ ఖాన్ తను చేసిన పనులకు సంబంధించి బిల్లులను పొందేందుకు అవసరమైన విజువల్ తనిఖీ రిపోర్డుపై సంతకం చేసేందుకు డిప్యూటీ కమిషనర్ రూ. 2వేలు డిమాండ్ చేయడంతో ఆయన ఎసిబి అధికారులను ఆశ్రయించారు.
దీంతో వారు వలపన్ని డిప్యూటీ కమిషనర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను రెడ్ హాండెండ్‌గా పట్టుకున్న ఎసిబి అధికారులు వారిని నాంపల్లిలోని ఎసిబి కోర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు ప్రవేశ పెట్టారు