హైదరాబాద్: గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో జిహెచ్ఎంసి రివ్యూ పిటిషన్ వేసింది. ఇటీవల ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తీర్పును పున:పరిశీలించాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ వేశారు. తీర్పులో ప్రధానంగా నాలుగు అంశాల తొలగించాలని, ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని జిహెచ్ఎంసి కోరింది. రబ్బరు డ్యామ్ నిర్మాణానికి కొంత సమయం అమసరమని, రబ్బరు డ్యామ్ నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని విజ్ఇప్తి చేసింది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, ట్యాంక్ బండ్ వైపు అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజులు పడుతుందని పేర్కొంది. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని, పెద్ద విగ్రహాలను నీటి కుంటలో నిమజ్జనం చేయడం కష్టమని చెప్పింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతరు ఏర్పాట్లను పూర్తి చేశామని, నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని పిటిషన్ లో జిహెచ్ఎంసి పేర్కొంది. అయితే, గణేష్ నిమజ్జనంపై వేసిన రివ్యూ పిటీషన్ ను న్యాయస్థానం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
GHMC Petition in HC Over Ganesh Nimajjanam