Sunday, January 19, 2025

కోచింగ్ సెంటర్లపై జిహెచ్‌ఎంసి దాడులు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలోని విచ్చలవిడిగా వెలసిన కోచింగ్ సెంటర్లపై జిహెచ్‌ఎంసి ఈవిడిఎం అధికారులు శనివా రం దాడులు నిర్వహించారు. కోచింగ్ సెంటర్లలో జిహెచ్‌ఎంసి నిబంధనల మేరకు ఫైర్ సేఫ్టీ సి స్టంను ఏర్పాటు చేయకపోవడంతో దాడులు చేశా రు. ఆర్‌టిఎసి ఎక్స్ రోడ్డు, అశోక్‌నగర్, పద్మారావు నగర్, అమీర్‌పేట, దిల్‌సుక్‌నగర్ తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లపై ఈవిడిఎం అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏ ఒక్క కోచింగ్ సెంటర్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదని బయటపడింది. కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఆయా కోచింగ్ సెంటర్లకు నోటీసు జారీ చేశారు.

వెంటనే ఫైర్ సేఫ్టీ మిటిగేషన్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలని విడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిబంధనలు పాటించని, ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చుకోని కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా నగరంలోని పలు కాలేజీల్లో కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏర్పాటు చేయనట్లు తెలిసింది. వందలాది మంది విద్యార్థులను చేర్చుకుంటున్న కాలేజీలు, వారి నుంచి లక్షలాది రూపాయలు వసూ లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీల్లో కూడా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చుకోని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News