Monday, December 23, 2024

క్రీడల ప్రొత్సాహానికి జిహెచ్‌ఎంసి ప్రత్యేక కృషి

- Advertisement -
- Advertisement -

అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలతో స్విమ్మింగ్ పూల్స్

GHMC special effort to promote sports

మన తెలంగాణ/సిటీ బ్యూరో: క్రీడాలు, క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిహెచ్‌ఎంసి ప్రత్యేక కృషి చేస్తోంది. గ్రేటర్ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్షంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి పరిధిలోని క్రీడా మైదానాలను పూర్తిగా ఆదునీకరించడంతో పాటు మల్టీ పర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చుచేస్తోంది. గ్రేటర్ పరిధిలో 854 క్రీడా మైదానాలు, స్పోర్ట్ కాంప్లెక్స్ నిర్వహణతో పాటు అవసరమైన ప్రదేశాల్లో నూతన స్పోర్ట్ కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను రూ.87 కోట్ల అంచనా వ్యయంతో 18 అభివృద్ది పనులను చేపట్టింది. ఇందులో ఇప్పటికే సుమారు 10 పనులు పూర్తి చేసిన అధికారులు వాటిని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు ఆధునిక, సాంప్రదాయ క్రీడల్లో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు కోచ్‌లను నియమించి వారి ద్వారా నిరంతరం ప్రత్యేక తర్పీదును ఇస్తున్నారు. తద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పథకాలను సాధించేలా క్రీడాకారులకు జిహెచ్‌ఎంసి తోడ్పాటును అందిస్తోంది. అంతేకాకుండా క్రీడాకారులందరికీ శారీరక ,మానసిక ఉల్లాసంతోపాటు వారి ఆరోగ్య పరిరక్షణకు స్వీమ్మింగ్ ఎంతోగానో ఉపయోగపడనున్నడంతో మొత్తం 15 స్విమ్మింగ్ పూల్స్‌ను జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇందులో కాటేదాన్, లాలపేట్ స్విమింగ్‌పూల్ పనులు చివరిదశలో ఉన్నాయ.ఇ అదేవిధంగా మొఘల్‌పుర చందూలాల్ భారాదరి, అంబర్‌పేటలో పిల్లల కోసం (బేబి స్విమింగ్ పూల్)లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

మరో రెండు స్విమ్మింగ్ పూల్స్ ప్రారంభానికి సిద్దం:

వనస్థలిపురంలోని సచివాలయం నగర్ కాలనీ, బి.ఎన్‌రెడ్డి నగర్‌లో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్విమ్మింగ్ పూల్ పనులు పూర్తి కావడంతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిహెచ్‌ఎంసి స్పోర్ట్ విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారుఆరులైన్లతో నిర్మించిన ఈ . ఈ స్విమ్మింగ్ పూల్స్‌లో గంటలకు లక్ష లీటర్ల నీటిని ఫిల్టర్‌చేసే సామర్థంతో ఫిల్టర్ రూంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 18 వాటర్ లైట్లు, బట్టలు మార్చుకునేందకు 3 గదులు మరో 3 బాత్‌రూములను పురుషుల కోసం ఏరాపటు చేశారు. అంతేకాకుండా బయట 6 షవర్స్, కోచ్ రూం, స్టోర్ రూం; రిసెప్షన్, వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News