Monday, January 20, 2025

క్రీడలకు జిహెచ్‌ఎంసి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రీడల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలను ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్షంగా జిహెచ్‌ఎంసి ఎనలేని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడా మైదానాల అభివృద్ధి, వసతుల కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రతి ఏటా వేసవిలో జిహెచ్‌ఎంసి నగరంలోని అన్ని మున్సిపల్ సర్కిళ్లలో సమ్మర్ క్యాంప్ లనునిర్వహిస్తున్నది. వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాలుగాతీర్చిదిద్దడం కోసం జిహెచ్‌ఎంసి గత నెల 25వ తేదీ నుండి మే 31 వరకు ఉదయం 6:15 గంటల నుండి 8:15 గంటల వరకు 44 రకాల ఆటల లోశిక్షణ అందిస్తున్నారు.

ఈ సమ్మర్ క్యాంప్ లలో ఔట్ డోర్, ఇండోర్ గేమ్స్ లతో పాటు స్పోర్ట్ క్విజ్, ఇంటర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. జిహెచ్‌ఎంసి స్పోర్ట్ క్విజ్ లో భాగంగా మంగళవారం చార్మినార్ జోన్ గౌలిపుర పిజి గ్రౌండ్ లో నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అబ్దుల్ హజీజ్-అబు బాకర్, ద్వితీయ బహుమతి మణిచరణ్-రేవంత్, తృతీయ బహుమతి హుస్సేన్ – అక్బర్ బేగ్‌లకు అందజేశారు. ఖైరతాబాద్ జోన్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్, జూబ్లీహిల్స్ షేక్ పేట్, గోషామహల్ హిందీ నగర్, ఖైరతాబాద్ బాలాపూర్ బస్తీ-సనత్ నగర్, విజయనగర్ కాలనీ మెహిదీపట్నం లో నిర్వహిస్తున్న షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణలో 700 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News