Monday, January 20, 2025

వీధి కుక్కల నియంత్రణకు జిహెచ్ఎంసి పటిష్ట చర్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వీధి కుక్కల నియంత్రణకు జిహెచ్‌ఎంసి విస్తృత చర్యలు జిహెచ్‌ఎంసి చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన వీధి కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాల అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలో జంతు పరిరక్షణకు పలుచర్యలు చేపట్టడంతో పాటు నగరం నలువైపులా ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని నిర్వహిస్తున్న జిహెచ్‌ఎంసి కుక్కల జనన, నియంత్రణతో పాటు రేబిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంది. కుక్కకాటుకు నివారణకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు తగిన కార్యచరణను జిహెచ్‌ఎంసి ప్రకటించింది. ముఖ్యంగా కుక్కల కాటు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలు తెలుసుకునేందుకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది.

కుక్క కాటు నివారణకు పాఠశాల, కళాశాల విద్యార్థులు,రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, స్వయం స్వయం సహాయక సంఘాల మహిళలకు, స్లమ్ ఫెడరేషన్ సభ్యులకు అవగాహన కల్పించ నున్నారు. అంతేకాకుండ ఇటీవలే పెంపుడు జంతువుల క్రిమిటోరియాలను కూడా ఆరు జోన్లలో ఏర్పాటుకు చర్యలు తీసుకోనైనది అంతే కాకుండా జరిగింది. ఇందులో భాగంగా 30 సర్కిల్లో 30 వాహనాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్ చర్యలు చేపట్టింది. గతంలో కుక్కల గణన సేకరణ సందర్భంగా 5. 75 లక్షల కుక్కలు ఉన్నట్లు నగరంలో ఉన్నట్టు గుర్తించడమే కాకుండా అందులో 75 నుండి 80% వరకు బర్త్ కంట్రోల్‌కు జంతు పరిరక్షణకు జాతీయ యానిమల్ బోర్డ్ , సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నది. ఇంక ప్రతి ఏడాది కుక్కల గణన చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే కుక్కలను యానిమల్ కేర్ సెంటర్ కు తీసుకొని వెళ్లి పరీక్షలు చేయాలని నిర్ణయించింది.

వివిధ వ్యాధులకు గురైన కుక్కలను చికిత్స చేసి నయమయ్యే వరకు జంతు సంరక్షణ కేంద్రంలోని ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వాటికి ఎలాంటి ఆహార సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. జంతు జనన నియంత్రణ(ఎబిసి),యాంటీ రేబీస్ ప్రోగ్రామ్ పర్యవేక్షణకు ప్రతి జోన్‌కు ఓ జాయింట్ కమిషనర్ ను నియమించారు. అంతేకాకుండా వీధి కుక్కలు గుమిగూడేందుకు ఆస్కారం ఇస్తూ వీధులు, బహిరంగ ప్రదేశాల్లో శాఖ, ఆహార వ్యర్థాలను పడవేస్తున్న మాంసాహార దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లకు నోటీసులు జారీ చేయడం, ఆదేశాలు పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా శనివారం నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాల ల్లోని పిల్లల, ప్రజలకు కుక్కల ప్రవర్తన , వ్యవహరించడంలో ‘చేయవలసినవి‘ ‘చేయకూడనివి సంబంధించిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. వీధి కుక్కల దాహాన్ని తీర్చడం ద్వారా వేసవిలో వాటి దాడులను తగ్గించడానికి అనువైన ప్రదేశాలలో నీటి వసతికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కుక్క కాటు నివారణకు స్వచ్ఛంద సంస్థలు , జంతు ప్రేమికులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కృషి చేయాలని, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని జిహెచ్‌ఎంసి కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News