Monday, January 20, 2025

ప్రజల వద్దకే పాలన

- Advertisement -
- Advertisement -

వార్డు పరిపాలన వ్యవస్థకు జిహెచ్‌ఎంసి శ్రీకారం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం నాటికి ప్రతి వార్డులో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పాలన వికేంద్రీకరణకు దిశగా అడుగులు పడుతున్నాయి. వార్డుల పరిపాలన వ్యవస్థకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. తద్వారా ప్రజల వద్దకు పాలన లక్షంతో నగరవాసులకు మరింత వేగవంతగా పరిపాలన ఫలాలు అందించేందుకు శ్రీకారం చుటుతున్నారు. పురపాలకశాఖ మంత్రి కె.తారక రామరావు అదేశాల మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు పూర్తి స్థాయి కసరత్తును మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ది నోత్సం జూన్ 2వ తేదీ నాటికి వార్డుల పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడమే లక్షంగా ప్రక్రియను వేగవంతం చేశారు.

4 జిల్లాలు, 25 నియోజకవర్గ్గాల్లో విస్తరించి ఉన్న జిహెచ్‌ఎంసి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 6 జోన్లు, 30 సర్కిళ్ల, మొత్తం 150 డివిజన్ల (వార్డులు)తో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరితో పాటు సంగారెడ్డి మొత్తం 4 జిల్లాల పరిధిలో 25 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న గ్రేటర్ పరిధిలో కోటిపై చి లుకు జనాభా నివసిస్తోంది. పరిపాలనపరంగా మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు 14 స్టాండింగ్ కమిటీ స భ్యులు ఉండగా, అధికార గణానికి సంబంధించి జిహెచ్‌ఎంసి ప్రధాన కమిషనర్, జోనల్ స్థాయి, సర్కిల్ స్థా యిలో అభివృద్ధ్ది పనులు, సంక్షేమ పథకాలు, పౌర సేవలను అందిస్తున్నారు. ఇదే క్రమంలో రోజురోజకు నగరం శరవేగంగా విస్తరించడం, అంతకు అంతా జనాభా పెరుగుతుండడంతో సత్వరమే పౌర సేవలను అందించడంలో కొంత అలస్యం జరుగుతున్న నేపథ్యంలోనే వార్డుల పరిపాలన వ్యవస్థకు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు శ్రీకారం చుట్టేలా పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

క్షేత్రస్థాయి పాలనే లక్షం
వార్డు పరిపాలన వ్యవస్థ ద్వారా ఇకా మీదట క్షేత్రస్థాయిలో పౌర సేవలు అందనున్నాయి. అంతేకాకుండా ప్రజా సమస్యలన్ని అక్కడికక్కడే పరిష్కా రం కానున్నాయి. తద్వారా ప్రజలకు శరవేగంగా పౌర సేవలు అందడంతో పాటు గంటల వ్యవధిలో సమస్యలు సైతం పరిష్కారం కానున్నాయి. ఇప్పటీ వరకు జిహెచ్‌ఎంసి ద్వారా ఎలాంటి సేవలను పొందాలన్నా సర్కిళ్ కార్యాలయాలు అక్కడ పరిష్కారం కాకపోతే జోన్‌ల్, అక్కడ కూడా పరిష్కరించకపోతే ప్రధాన కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రతి సర్కిల్ పరిధిలో 4 నుంచి 6 వార్డులు ఉండడమే కాకుండా దాదాపుగా 3 నుంచి5 లక్షల మంది నివసిస్తుండడంతో సత్వరమే పౌర సేవలను అందించడం కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు గాను పురపాలక శాఖమంత్రి కెటిఆర్ ఆలోచనలకు అనుగుణంగా వార్డుల పరిపాలన వ్యవస్థకు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి పురపాలక శాఖ అధికారుల సహాకారంతో జిహెచ్‌ఎంసి అధికార గణం పూర్తి స్థాయి కసరత్తును మొదలు పెట్టారు.

ఇందులో భాగంగానే ఈ విధానంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు గత నెల 25, 26 తేదీల్లో రెండు రోజులు 5మంది జోనల్ కమిషనర్ల నేతృత్వంలో 5 మం దితో కూడిన మొత్తం 5బృందాలు మెట్రోనగరాల మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటించారు.
ఇందులో భాగంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ నేతృత్వంలో న్యూఢిలీ మున్సిపల్ కార్పోరేషన్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి. మమత నేతృత్వంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో చెన్నై మున్సిపల్ కార్పోరేషన్, ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్ పంకజా నేతృత్వంలో కొల్‌కత్తా మున్సిపల్ కార్పోరేషన్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య నేతృత్వంలో బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో ఈ బృందాలు పర్యాటించి ఆయా మున్సిపల్ కార్పోరేషన్లు పౌరులకు అందిస్తున్న సేవలను క్షుణంగా అధ్యయనం చేసి వచ్చాయి. ఈ అధ్యయన బృందాలు ఇచ్చిన నివేదకలను క్రోడికరించి ఇందులో ఉత్తమమైన మార్గాలను ఎంచుకోనున్నట్లు సమాచారం.

ఎఎంసిలు, ఇంఛార్జీలుగా వార్డు కార్యాలయాలు
వార్డుల పరిపాలన వ్యవస్థలో భాగంగా ప్ర తి వార్డు హెడ్ క్వార్టర్‌లో ప్రత్యేకంగా వార్డు ఆఫీసును ఏర్పాటు చేయడంతోపాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఇంఛార్జీగా అతి ప్రధానమైన 10 విభాగాల అధికారులు నియమించి. వీరి ద్వారా వార్డు స్థాయిలోనే ప్ర జా సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నారు. వార్డుల ప్రధాన సమస్యలుగా ఉండే పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్వహణ, ఎంటమాలజీ విభాగము, వెటర్నరీ విభాగము, టౌన్ ప్లానింగ్ విభాగం, జలమండలి, వరద ముంపు తదితర విభాగాలకు చెందిన 8 నుంచి 10 మంది అధికారులను ప్రతి వార్డు కార్యాలయంలో నియమించనున్నారు.

కమిషనర్, ఉన్నతాధికారులతో సమీక్ష
వార్డుల పరిపాలన వ్యవస్థ ప్రక్రియకు సంబంధించి గురువారం జిహెచ్‌ఎంసి కమిషనర్ ఉన్నతాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించి బుధవారం పురపాలక శాఖ ఉన్నతాధికారులతోపాటు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ విధానాన్ని మే చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదేక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు వివిధ విభాగాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వార్డు పరిపాలన వ్యవస్థ అమలుకు అవసరమైన విధి విధానాలపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా వార్డు కార్యాలయాల్లో నియమించాల్సిన సి బ్బంది జాబితాతో పాటు వారికి ఇందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లను సమిక్షించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News