హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంత కర్తగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకొని జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానియుడు ప్రోఫెసర్ జయ శంకర్ అని అన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పుస్తకాలు రచించినట్లు కమిషనర్ తెలిపారు. జయశంకర్ స్ఫూర్తి నీ అందరూ అలవర్చుకోవాలని కమిషనర్ కోరారు. ఈవిడిఎం విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, బి.సంతోష్, జయరాజ్ కెన్నెడీ, విజయలక్ష్మి, వి. కృష్ణ, ఈ ఎన్ సి జియాఉద్దీన్, సురేష్ కుమార్, సిఇ దేవానంద్, సరోజ రాణి, టౌన్ ప్లానింగ్ అడిషనల్ సిపీ శ్రీనివాస్, సిపీ ఆర్ ఓ ముర్తుజా, సెక్రటరీ, లక్ష్మి, జోనల్ కమిషనర్ లు మమత, పంకజ, శ్రీనివాసరెడ్డి, అశోక్ సామ్రాట్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జయశంకర్‌కు జిహెచ్‌ఎంసి ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
- Advertisement -