Thursday, January 9, 2025

గ్రేటర్ గులాబీకి రథసారథులు నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ జిల్లాకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్
రంగారెడ్డికి ఇబ్రహింపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ఎమ్మెల్సీ సభ్యులు శంబీపూర్ రాజు
పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామంటున్న నూతన అధ్యక్షులు
మూడోసారి రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌దే అధికార పీఠమని మాగంటి వెల్లడి


మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ గులాబీ పార్టీ బలోపేతం కోసం సిఎం కెసిఆర్ మూడు జిల్లాలకు సారథులను నియమించారు. ఈసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ పగ్గాలు అప్పగించారు. ప్లీనరీ కంటే ముందు మహానగరంలోని 150 డివిజన్లకు సంబంధించిన 08 కమిటీలు పూర్తి చేసి, తరువాత అందరి అభిప్రాయాలు తీసుకుని అధ్యక్షులను నియమిస్తామని గతంలో పార్టీ సీనియర్లు ప్రకటించారు. దీంతో బుధవారం అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్షుల జాబితాను పార్టీ చీప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. అందులో హైదరాబాద్ జిల్లాకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రంగారెడ్డి జిల్లాకు ఇబ్రహింపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎమ్మెల్సీ,యువనేత శంబీపూర్ రాజుకు బాధ్యతలు కట్టబెట్టారు. వీరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో పార్టీ చేపట్టే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నగర నేతలు పేర్కొంటున్నారు. పార్టీలో అసంతృప్తులకు చోటు లేకుండా అన్ని వర్గాలకు సముచిత స్దానం కల్పించి, విపక్షాలకు ఖంగుతినేలా కెసిఆర్ చేసినట్లు డివిజన్ నాయకులు చెబుతున్నారు. ఈతరహాలో కమిటీ వేయడం ఇప్పటివరకు ఏపార్టీలో జరగలేదని, కాంగ్రెస్, బిజెపి పార్టీలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేసేవారని, టిఆర్‌ఎస్ పార్టీలో బిసి,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చోటు దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు నియమించి అధ్యక్షుల సారథ్యంలో మూడోసారి టిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులుగా సేవలందించి అపార అనుభవం కల్గిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడం చూస్తూంటే రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఎదురులేని శక్తి ఉంటుందని చెప్పారు.
పెద్ద ఎత్తున అధ్యక్షులకు సన్మానం ః నూతనంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ పార్టీ జిల్లాలకు అధ్యక్షులు స్దానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సన్మానం కార్యక్రమాలు చేశారు. జాబితా ప్రకటించి రెండు గంటలు గడవక ముందే గజామాలతో అధ్యక్షులు నివాసాలకు చేరుకుని అభినందనలు తెలిపి సెల్పీ దిగారు. నేటి నుంచి మీకు వెంట మీమంతా ఉంటామని పేర్కొన్నారు. స్దానిక నాయకులంతా ఐకమత్యంగా పనిచేసి ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ చెప్పినట్లు యూసుప్‌గూడ డివిజన్ నేతలు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News