Sunday, December 22, 2024

స్పీడ్ పెంచిన ఘోష్ కమిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాళేశ్వరం క మిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. కాళేశ్వరం విచారణ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ కు చేరుకుని సాయంత్రం అధికారులతో సమావేశమయ్యారు. రేపటి నుంచి మరోసారి కాళేశ్వరంపై విచారణను ప్రారంభించనున్నారు. రెం డు వారాల పాటు కమిషన్ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిటైర్డ్ ఇంజినీర్లను విచారించిన కాళేశ్వరం కమిషన్ విజిలెన్స్ ఎన్డీఎస్‌ఏ , కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై విచారణ చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐఏఎస్‌ల విచారణ తర్వాత ఈ సారి ప్రజాప్రతినిధులను, గత ప్రభుత్వ పెద్దలను విచారించే అవకాశం ఉంది. అధికారుల విచారణ అనంతరం ప్రజాప్రతినిధులకు నోటీసులిచ్చి కమిషన్ విచారించనుంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్, గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్న హరీశ్ ను కూడా కమిషన్ విచారణ చేయనుందని తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో పలుమార్లు కేసీఆర్, హరీశ్ రావు పేరు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. అఫిడవిట్ల సమర్పించిన అధికారులు, ఇంజినీర్లు, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పేర్లను ప్రస్తావించారు.

అయితే హరీశ్ రావు ఆదేశాల మేరకే చేశామంటూ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి కమిషన్ కు వివరించడంతో పాటు అఫిడవిట్ సైతం ఇచ్చారు. తన విచారణ సందర్భంగా సుధాకర్ రెడ్డి మూడు సార్లు హరీశ్ రావు పేరును ప్రస్తావించారు. దీంతో తనను కూడా విచారణకు పిలుస్తారని హరీశ్ రావు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇరిగేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు, గతంలో విచారణకు హాజరైన వారితో హరీశ్ మంతనాలు జరిపినట్లు సమాచారం. హరీశ్ విచారణ తర్వాతే తన విచారణ ఉంటుందని సన్నిహితులతో కేసీఆర్ చెబుతున్నట్టు తెలిసింది. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజం పడింది కాబటి. ఒప్పందాలు, కాంట్రాక్టులు అన్నీ ఆయన హయాంలోనే జరిగాయి. ఇందులో హరీశ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని భావించిన కేసీఆర్ ఆయనను మంత్రిపదవి నుంచ తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని కూడా కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి వాటికి తానెలా సమాధానం చెప్పాలనే అంశంపై కేసీఆర్ పూర్తి స్థాయిలో స్రిద్ధమవుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News