Monday, December 23, 2024

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు : గులాం నబీ అజాద్

- Advertisement -
- Advertisement -

జమ్ము : రానున్న లోక్‌సభ ఎన్నికలకు తాను పోటీ చేయబోనని, అయితే కొత్తగా తాము ఏర్పాటు చేసిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ (డిపిఎపి) నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం సాగిస్తానని సీనియర్ రాజకీయవేత్త గులాంనబీ అజాద్ శనివారం వెల్లడించారు. 2014నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పొందిన తరువాత అజాద్ తనకు తానే లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. నగ్రోటాలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆందోళన సాగిస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నూటికి నూరు శాతం అనుకున్న సమయంలోనే జరుగుతాయని, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు సెప్టెంబర్ గడువు విధించినందున తానింకా వాటి గురించి ఆలోచించలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News