- Advertisement -
జమ్ము : దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తన రాజకీయ పార్టీ పేరును “డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ” గా సోమవారం మీడియాకు వెల్లడించారు. మూడు రంగులతో కూడిన ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మూడు రంగులు నిలువుగా ఉన్న ఆ జెండాలో మొదటి రంగు నీలం, మధ్యలో తెలుపు రంగు, మూడో రంగు పసుపు. జెండాను అలా డిజైన్ చేయడానికి కారణాన్ని కూడా ఆయన వివరించారు. పసుపు రంగు కొత్తదనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, తెలుపు శాంతికి చిహ్నమని, నీలం స్వేచ్ఛకు, సముద్రం లోని లోతుకు,అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని ఆయన చెప్పుకొచ్చారు.
- Advertisement -