Tuesday, November 5, 2024

ఉమ్మడిసివిల్ కోడ్‌ను అమలు చేయడం అంత సులువు కాదు : గులాం నబీ అజాద్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : ఉమ్మడి సివిల్ కోడ్‌ను అమలు చేయాలనుకోవడం ఆర్టికల్ 370ను రద్దు చేసినంత సులువు కాదని, అది అమలు చేస్తే అన్ని మతాలపై ప్రభావం చూపిస్తుందని మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ శనివారం కేంద్రాన్ని హెచ్చరించారు. ఉమ్మడి సివిల్ కోడ్ అమలు చేసే ప్రశ్నేలేదు. అన్ని మతాలతో ఇది ముడిపడి ఉంది.

కేవలం ముస్లింలే కాదు, క్రైస్తవులు, సిక్కులు, గిరిజనులు, జైన్లు, పార్సీలు, తదితర మతాలన్నిటిపైనా ప్రభావం చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మతాల వారినందరినీ ఒకేసారి రెచ్చగొట్టినట్టవుతుందని కేంద్రాన్ని , ఏ ప్రభుత్వానికి కూడా ఇది మంచి చేయదని హెచ్చరించారు. ఈ విషయంలో ముందడుగు వేయడానికి కూడా ఆలోచించకూడదని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News