Monday, December 23, 2024

వర్మను బట్టలూడదీసి కొడుతాం

- Advertisement -
- Advertisement -

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మని వర్మను బట్టలూడదీసి కొడుతామని ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డైరెక్టర్ వర్మ మరోసారి ఎపి రాజకీయాలపై సినిమా తీస్తున్నాడు. ఈసారి ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోణంలో సినిమా తీస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, సిబిఐ కేసులో జగన్ జైలుకు వెళ్లడం, జైలు అనంతరం జగన్ కొత్త పార్టీ పెట్టడం వంటి కీలక అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ పెట్టిన వర్మ..ఇటీవల టీజర్‌ను కూడా విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్‌పై స్పందించిన గిడుగు రుద్రరాజ్.. వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే ఊరుకునేది లేదని, తప్పుగా చూపిస్తే వర్మను బట్టలూడదీసి కొడుతామని హెచ్చరించారు. అసలు వాస్తవాలు వర్మకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజ్ స్పష్టం చేశారు.

Also Read: ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News