Monday, December 23, 2024

టర్బో బూస్టర్స్‌తో వచ్చిన సరికొత్త జిఫ్ఫీ..

- Advertisement -
- Advertisement -

Giffy Comes with Turbo Boosters

హైదరాబాద్‌: బంగాళాదుంప కూర్మాతో పూరి, బాగా వేయించిన పకోడి లేదా అత్యంత ఆహ్లాదకరంగా గిన్నెలో ఉన్న క్యారెట్‌ హల్వాను ఆస్వాదించకుండా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ఏ మాత్రం సంశయం లేకుండా మనమంతా ఆ రుచులను ఆస్వాదించాలనే కోరుకుంటాం. కానీ ఇబ్బంది పెట్టే అంశం ఏమిటంటే, పసందైన విందు తరువాత వంట పాత్రలలో మిగిలిన నూనె, జిడ్డును వదిలించేందుకు పడే కష్టం. సమయం కూడా ఎక్కువగానే తీసుకుంటాయి. సాధారణ డిష్‌ వాష్‌ లిక్విడ్స్‌తో పోలిస్తే, పూర్తి సరికొత్త జిఫ్పీ ఇప్పుడు టర్బో బూస్టర్స్‌తో వస్తుంది. విప్రో కన్స్యూమర్‌ కేర్‌ నుంచి వస్తోన్న ఈ లిక్విడ్‌ మీ కష్టాన్ని పూర్తి నైపుణ్యంతో సులభతరం చేస్తుంది.

అంతర్జాతీయంగా బెంచ్‌మార్క్‌ చేయబడిన సృజనాత్మక డిష్‌వాష్‌ ఫార్ములా తో తీర్చిదిద్దబడిన జిఫ్ఫీ అసాధారణ క్లీనింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. పూర్తి సరికొత్త జిఫ్పీని అక్రిడియేటెడ్‌ ల్యాబ్‌ ధృవీకరించింది. లోతుగా శుభ్రపరచడంతో పాటుగా కఠినమైన మరియు జిడ్డు తో కూడిన ఆహార పదార్థాలు లేకుండా పూర్తిగా శుభ్రపరుస్తుంది

ఈ నూతన ఆవిష్కరణ గురించి నీరజ్‌ ఖత్రీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, కన్స్యూమర్‌ కేర్‌, ఇండియా అండ్‌ సార్క్‌ బిజినెస్‌, విప్రో కన్స్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ మాట్లాడుతూ ‘‘టర్బో బూస్టర్స్‌ సాంకేతికతతో నూతన జిఫ్పీ అత్యున్నత క్లీనింగ్‌ సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీనిలో వినూత్నమైన, అంతర్జాతీయంగా బెంచ్‌మార్క్‌ చేయబడిన ఫార్ములా ఉంది. విప్రో వద్ద, మేము సాటిలేని నాణ్యతను మా వినియోగదారులకు అందించే వినూత్నమైన ఉత్పత్తులను సృష్టించాలనుకుంటున్నాము. జిఫ్ఫీతో, మేము మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా నూతన వేరియంట్లను తీసుకురానున్నాము’’ అని అన్నారు.

టర్బో బూస్టర్స్‌ సాంకేతికతతో పూర్తి సరికొత్త జిఫ్పీ డిష్‌వాష్‌ లిక్విడ్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రాచుర్యం పొందిన డిష్‌వాషింగ్‌ లిక్విడ్స్‌తో పోలిస్తే 50% అధికంగా ప్రభావం చూపుతుంది. శాస్త్రీయంగా నిరూపితమైన, డీప్‌ క్లీన్‌ సొల్యూషన్‌ జిఫ్పీని జిడ్డు తొలగించడంలో నిష్ణాతునిగా మార్చడంతో పాటుగా మీ సమయమూ ఆదా చేస్తుంది.

పూర్తి సరికొత్త జిఫ్పీ 145 మిల్లీ లీటర్ల ప్యాక్‌ 35 రూపాయల ధరలో లభిస్తుంది. ఇది ఒకటి కొంటే మరొకటి ఉచితం ఆఫర్‌తో సైతం లభిస్తుంది . దగ్గరలోని స్టోర్లు, ఈ–కామర్స్‌ వేదికలతో పాటుగా https://wiproconsumercare.com/giffy-dish-wash/ వద్ద కూడా లభ్యమవుతుంది.

Giffy Comes with Turbo Boosters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News