Monday, December 23, 2024

అయోధ్య రామాలయానికి కానుక

- Advertisement -
- Advertisement -

సీతమ్మ తల్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత కారుడి అద్భుతం…

మన తెలంగాణ/హైదరాబాద్ : అయోధ్య రామాలయానికి కానుకగా తెలంగాణలోని సిరిసిల్ల చేనేతకారుడు అపురూప కానుకను సిద్ధం చేశారు. సీతమ్మ తల్లికోసం బంగారు చేనేత చీరను సిద్ధం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికుడు వెళ్ది హరిప్రసాద్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. దీనికోసం బంగారు తీగతో మగ్గంపై రామాయణ ఇతివృత్తాలు దృశ్యాల రూపంలో కనిపించేట్టుగా చీర నేశారు. ఈ చీర కోసం రూ. లక్షన్నర ఖర్చుపెట్టారు హరిప్రసాద్. భార్యాభర్తలిద్దరూ కలిసి 20 రోజులపాటు శ్రమించి ఈ చీరను నేసామని తెలిపారు.

చీరమీద అయోధ్య రాముడి గుడి వచ్చేలా చీరను సృష్టించారు. ఈ బంగారు పట్టుచీరపై రామాయణ ఘట్టాలతో చీరనేశారు. ఈ చీర నేతలో బంగారాన్ని వాడారు. చీరను ఎప్పుడైనా తీసినా దాంట్లో నుంచి ఎనిమిది గ్రాముల బంగారం వస్తుందని తెలిపారు. ఈ చీర బరువు 900 గ్రాములు ఉంటుంది. ఈ చీరను శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తో ఓపెన్ చేయించారు. ఈ నెల 26 న భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి.. ఈ చీరను చూపించబోతున్నట్లుగా హరిప్రసాద్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News