గిగ్ వర్కర్లు అంటే వివిధ ప్లాట్ఫారమ్ల ద్వారా తాత్కాలిక,సౌకర్యవంతమైన ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు. సాంప్రదాయ ఉద్యోగులుగా పరిగణించబడరు. గ్రీగ్ కార్మికులు సాంప్రదాయ యజమాని, ఉద్యోగి సంబంధాల వెలుపల పనిచేసే స్వతంత్ర కాంట్రాక్టర్లు. వారు వారి షెడ్యూల్లు మరియు ఆసక్తుల ఆధారంగా ఇతర ఉద్యోగాలు చేస్తారు.ఉదాహరణకు ఉబెర్ మరియు ఒలా కోసం రైడ్-షేరింగ్ డ్రైవర్లు, జొమాటో మరియ స్విగ్గీ కోసం ఫుడ్ డెలివరీ కార్మికులు,గ్రాఫిక్ డిజైన్ మరియు కంటెంట్ రైటింగ్ వంటి ఫ్రీలాన్స్ సేవలు అందించే వారు,భవన నిర్మాణ కార్మికులు,దినసరి కూలీలు,గృహ సహాయం చేసే కార్మికులు.ఇన్ని విధాలుగా పనిచేస్తారు.ఇది పూర్తిగా ఇంటర్నెట్ ద్వారా నిర్వహించబడుతుంది. వీరికి అస్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆరోగ్య బీమా లేదా చెల్లింపు సెలవులు వంటి ప్రయోజనాలకు పరిమిత యాక్సెస్ ఉంటుంది.భారతదేశంలో గీగ్ ఆర్థిక వ్యవస్థ ఉంది.అది వేగంగా విస్తరిస్తోంది.ఉపాధి విధానాల కోసం సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
గిగ్ కార్మికులు, సాధారణంగా ఇందులో పాల్గొంటారు. స్వల్పకాలిక, సౌకర్యవంతమైన ఉద్యోగాలు,తరచుగా లేకపోవడం,రక్షణ మరియు ప్రయోజనాలు సాంప్రదాయకంగా పూర్తి సమయంతో అనుబంధించబడింది ఉపాధి.కోవిడ్ సమయం లో ఈ మహమ్మారి అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది భారతదేశంలోని గిగ్ కార్మికుల కోసం.గిగ్ వర్కర్స్,వీరు ఎక్కువగా స్వల్పకాలిక ఉద్యోగాల పైఆధారపడతారు.రైడ్-షేరింగ్ మరియు ఫుడ్ డెలివరీ వంటివి,ఈ సమయం లో ఆకస్మిక ఆదాయం మరియు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొన్నారు.డిమాండ్ తగ్గినప్పుడు భద్రత పదునుగా, ప్రయోజనాలు లేకుండా మరియు సాధారణ ఉద్యోగులకు రక్షణ కలిగి స్వతంత్ర కాంట్రాక్టర్లను నియమించుకోవడం వల్ల ఉద్యోగి ప్రయోజన ప్యాకేజీలు, పదవీ విరమణ ప్రణాళికలు మరియు అనారోగ్య సెలవులు వంటివి వుండవు.బతకడానికి కష్టపడుతున్నారు.వీరికి లేబర్ కోడ్ ఉంటుంది.
సామాజిక భద్రత, 2020 (ఇకపై ‘కోడ్‘ గా సూచిస్తారు) కలిగి ఉండి 9 కార్మిక చట్టాలను ఒక దానితో కలిపారు.సామాజిక భద్రతను అందరికీ విస్తరించడమే లక్ష్యం.ఉద్యోగులు మరియు కార్మికులు వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగం.ముఖ్యమైన మార్పులలో ఒకటి ఈ కోడ్లో ప్రవేశపెట్టబడింది.కార్మికులను ఇందులో చేర్చారు.కోడ్ యొక్క సెక్షన్ 2(35) ప్రకారం, ‘గిగ్‌పనివాడు‘ అంటే ఒక వ్యక్తి పని చేస్తుంది లేదా అనేది తెలుస్తుంది.పని తో పాటు సంపాదన కుడా ఉంటుంది.చాలా మందికి గిగ్ వర్కర్లు అంటే ఎవరో తెలియదు.గిగ్ వర్కర్లు అంటే బుకి్ంప పని చేసేవారు.స్టాండప్ కమెడియన్లు, రచయితలు ఎవరైనా ఈ కేటగిరీలోకి వస్తారు.స్టాండప్ కమెడియన్లు,రచయితలు ఎవరైనా ఈ కేటగిరీలోకి రావచ్చు. దేశంలో దాదాపు 1.5 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య షార్ట్ టర్మ్, మిడి టర్మ్లో దాదాపు 24 మిలియన్లు కాగా, లాంగ్టర్మ్లో 90 మిలియన్ గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థలో భాగమవుతారు.భారతదేశంలో మొదటిసారిగా, కొత్తగా ఆమోదించబడిన లేబర్ కోడ్లు అసంఘటిత రంగంలోని కార్మికులతో పాటు గిగ్ మరియు ప్లాట్ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రతను అందిస్తాయి.భారతదేశంలో నిరుద్యోగిత తీవ్రమవుతున్న సమయంలో ’గిగ్ ఎకానమీ’ అనే మాట తరచూ వినిపిస్తోంది.
చదువుకున్నవారు ఉద్యోగాలు దొరక్క, సరైన ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు.ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు, లేదా రోజులో కొన్ని గంటల సమయం స్విగ్గీ, ర్యాపిడో, వోలా, జోమాటో, అమెజాన్ డెలివరి వరక్స్, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ వంటి సర్వీసుల్లో పని చేస్తున్నారు. ఇలాంటి ఉపాధిని కల్పించే ఆర్థిక వ్యవస్థను గిగ్ ఎకానమీ అంటారు. చాలామంది యువత రోజువారి ఖర్చుల కోసం బైక్ రైడర్ వంటి పనులు చేస్తూ ఇన్స్టంట్ మనీ సంపాదిస్తున్నారు.ఇంటర్,డిగ్రీ సెకండియర్ నుంచి ఇలాంటి పని (గిగ్ వర్క్) చేస్తున్నారు.తన ఫ్రీ టైమ్ లో రైడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.ఎంటర్టైన్మెంట్ రంగంలో యాక్టర్ లేదా డైరెక్టరుగా స్థిరపడాలనే ఆలోచన. దానికి తగ్గ పనులు చేస్తూనే, మిగిలిన టైమ్ లో రైడర్ గా పని చేస్తున్నారు.రోజువారి అవసరాలకు అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎవర్ని అడగలేక, డబ్బులు కావాలనుకున్నప్పుడు యాప్ అన్ చేసుకుని టార్గెట్ పెట్టుకుని డబ్బులు సంపాదిస్తారు.
దీనిపైనే జీవితాంతం ఆధారపడాలని అనుకోవడం లేదు.పైగా కాంపిటీషన్ బాగా పెరిగిపోయి,ఆదాయం కూడా పడిపోయింది.దేశంలో గిగ్ ఎకానమీ పెరుగుతోందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పింది.ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా పని చేసుకునే అవకాశముండటంతో గిగ్ ఎకానమీ అన్ని రంగాల్లో పెరుగుతోందని తెలిపింది.‘గిగ్ వర్కర్లు ప్రస్తుతం దేశంలోని వర్క్ ఫోర్సులో 1.5 శాతం మంది ఉన్నారు.ఇది వర్కర్లకు,సంస్థలకు,వి నియోగదారులకు అందరికి ఉపయోగకరంగా ఉంది.ఇందులో తక్కువ వేతనాలు,వర్కర్స్ కి చట్టాలు పెద్దగా లేకపోవడం వంటి సమస్యలున్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.పనిచేస్తున్న కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి ఇంకా అనేక సంస్కరణలు చేయవలసి ఉంది.ఈ సంస్కరణలతో ముందుకు సాగడానికి, కొన్ని షరతులు పాటించాలి.
అయితే, మొదటగా, గిగ్ ఎకానమీ కార్మికులను ప్రభావితం చేయడానికి మెరుగైన చట్టపరమైన నిర్మాణం అవసరం.ప్రస్తుతం, భారతదేశం గిగ్ ఎకానమీ కార్మికులను గుర్తించలేదని నీతి ఆయోగ్ నివేదిక వ్యాఖ్యానించింది.నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసాను ఇస్తూ ఎంతోమంది బీద,మధ్య తరగతి కుటుంబాలకు ఉద్యోగ ఉపాధిని చూపిస్తుంది.భారతదేశం మరియు ప్రపంచంలో పెరుగుతున్న కార్మికుల వల్ల వారిని రక్షించడానికి,వారు కూడా కార్మికుల వలె మెరుగైన పరిస్థితులను పొందేలా చూసేందుకు ప్రభుత్వం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను గ్రహించి, మార్చాలి. ముఖ్యమైన మార్పులతో మాత్రమే గిగ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అప్పుడే నిజమైన మార్పును సాధ్యమవుతుంది.
(డాక్టర్ మోటె చిరంజీవి, సామాజికవేత్త విశ్లేషకులు)