Sunday, April 13, 2025

గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు ఇశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోండి

- Advertisement -
- Advertisement -

లాంఛనంగా గుర్తింపు కోసం, ఎబిపిఎంజెఎవై ప్రయోజనాల కోసం ఇశ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవలసిందిగా గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు తాను విజ్ఞప్తి చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ శనివారం తెలియజేసింది. గిగ్, ప్లాట్‌ఫామ్ ఆర్థికవ్యవస్థ విస్తరిస్తోందని, రైడ్‌షేరింగ్, పంపిణీ, లాజిస్టిక్స్, వృత్తిగత సేవలు వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలను ఆఫర్ చేస్తోందని కార్మిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

భారత్‌లో గిగ్ ఆర్థికవ్యవస్థ 202425లో ఒక కోటి మందికిపైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని, అది 202930 నాటికి 2.35 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ జోస్యం చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల తోడ్పాటును గుర్తిస్తూ 202526 కేంద్ర బడ్జెట్‌లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబిపిఎంజెఎవై) కింద ఆరోగ్య బీమా సౌకర్యం, గుర్తింపు కార్డుల జారీ, ఇశ్రమ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కార్మికుల పేర్ల నమోదు కోసం నిబంధనలను ప్రకటించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News